AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lizard in Thums up: వామ్మో కూల్ డ్రింక్‌లో బల్లి.. కంగుతిన్న కస్టమర్‌! తర్వాత ఏం జరిగిందంటే!

వేసవి మొదలు కాకముందే భానుడి భగభగలు స్టార్ట్ అయ్యాయి. ఇంట్లో ఉక్కబోత, బయట వేడి గాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఎండతాపం నుంచి ఉపసమనం పొందేందుకు కూల్ డ్రింక్స్‌, ప్రూట్‌ జ్యూస్ వంటికి తాగుతుంటారు. ఇలానే కూల్‌డ్రింక్ తాగేందుకు వెళ్లిన ఇద్దరి యువకులకు షాక్ తగిలింది. వాళ్లలొ ఒకరు తాగిన కూల్‌డ్రింక్‌లో చనిపోయిన బల్లి ప్రత్యక్షమైంది. అది చూసిన కస్టమర్‌ ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

Lizard in Thums up: వామ్మో కూల్ డ్రింక్‌లో బల్లి.. కంగుతిన్న కస్టమర్‌! తర్వాత ఏం జరిగిందంటే!
Lizard In Cool Drink
P Shivteja
| Edited By: Anand T|

Updated on: Apr 18, 2025 | 1:28 PM

Share

వివరాల్లోకి వెళ్తే..సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు పెద్దపూర్ గ్రామ శివారులో జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ ఇద్దరు థంసప్ కూల్‌డ్రింక్‌ తీసుకున్నారు. ఇద్దరిలో ఓ యువకుడు సగం థంసప్ తాగిన తర్వాత వాంతులు చేసుకున్నాడు. దీంతో అనుమానం వచ్చిన అతని ఫ్రెండ్ ఆ సీసాలో ఏదైనా ఉందేమోనని చూడగా అందులో ఎప్పుడో చనిపోయిన ఒక చిన్న బల్లి దర్శనం ఇచ్చింది. అది చూసిన యువకుడు వెంటనే రెస్టారెంట్‌లోకి వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశాడు. దీంతో వారు పొంతనలేని సమాధానాలు చెప్పారు. అసలు ఆ కూల్ డ్రింక్ మేము తయారు చేయలేదని.. మాకేం సంబంధం అని తిరిగి ఆ యువకులపైనే దౌర్జన్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది. మీకు నచ్చింది చేసుకోండని వాళ్లని అక్కడి నుంచి పంపేసినట్టు యువకులు చెబుతున్నారు. ఈ రెస్టారెంట్‌లో గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని ఆ యువకులు ఆరోపిస్తున్నారు.

ఈ వీడియో చూడండి…

ఇంత జరుగుతున్న ఫుడ్‌ సేఫ్టీ అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఇలాంటి హోటల్ యజమాన్యాలపై కనీస చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ హోటల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…