Bank Hours In Telangana: తెలంగాణలో బ్యాంకుల పనివేళల్లో నేటినుంచి మార్పులు.. పూర్తి వివరాలు..

Banking News: తెలంగాణలో నేటినుంచి లాక్‌డౌన్ నిబంధనలు మారనున్నాయి. దీంతో గురువారం నుంచి బ్యాంకు పని వేళలు యథావిధిగా కొనసాగుతాయని ఎస్‌ఎల్‌బీసీ

Bank Hours In Telangana: తెలంగాణలో బ్యాంకుల పనివేళల్లో నేటినుంచి మార్పులు.. పూర్తి వివరాలు..
Banks
Follow us

|

Updated on: Jun 10, 2021 | 7:53 AM

Banking News: తెలంగాణలో నేటినుంచి లాక్‌డౌన్ నిబంధనలు మారనున్నాయి. దీంతో గురువారం నుంచి బ్యాంకు పని వేళలు యథావిధిగా కొనసాగుతాయని ఎస్‌ఎల్‌బీసీ వెల్లడించింది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించడంతో.. గతంలో మాదిరిగానే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగుతాయని పేర్కొంది. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం లాక్‌డౌన్‌ను ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు పొడగించిన విషయం తెలిసిందే. అయితే.. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఉన్న సడలింపు సమయాన్ని సాయంత్రం 5 గంటల వరకు పెంచిన విషయం తెలిసిందే. అదనంగా ఇళ్లకు వెళ్లేందుకు 1 గంట సమయాన్ని ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో.. మేలో విధించిన లాక్‌డౌన్‌ నాటి నుంచి బ్యాంకు పని వేళలు మారాయి. లాక్‌డౌన్‌ ప్రారంభంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు బ్యాంకులు పనిచేశాయి. ఆ తర్వాత జూన్‌ ఒకటో తోదీ నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకులు సేవలందించాయి. తాజాగా.. ఈ రోజు నుంచి సడలింపు సమయాన్ని పెంచడంతో సాధారణ సమయాల్లోనే బ్యాంకింగ్‌ కార్యకలాపాలు కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు. బ్యాకింగ్‌ సమయ వేళలను ఖాతాదారులు గమనించాలని ఎస్‌ఎల్‌బీసీ ప్రకటనను విడుదల చేసింది.

Also Read:

Building Collapsed: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం.. 9 మంది మృతి..

CM Jagan : ఈ ఉదయం ఢిల్లీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ పయనం.. అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ.!