Telangana: మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు, మా లక్ష్యం అదే.. బండి సంజయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్‌.. 'వందల కిలోమీటర్లు నాతో నడిచిన సంగ్రామ సేనకు రుణపడి ఉంటాను. ఇంత పెద్ద అవకాశమిచ్చిన మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలకు ధన్యవాదాలు. ఎన్నికల యుద్ధ రంగంలో ఉన్నాం. కార్యకర్తల త్యాగాలను వృధాగా పోనివ్వము. గోల్‌కొండపై కాషాయ జెండాను రెపరెపలాడిస్తాం. బీజేపీలో గ్రూపులున్నాయని, పార్టీ గ్రాఫ్ తగ్గిందనేది కేవలం దుష్ప్రచారమే. మా మధ్య ఎలాంటి విబేధాలు లేవు, పార్టీని అధికారంలోకి...

Telangana: మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు, మా లక్ష్యం అదే.. బండి సంజయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
Bandi Sanjay
Follow us
Ashok Bheemanapalli

| Edited By: Narender Vaitla

Updated on: Aug 05, 2023 | 10:10 AM

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న బండి సంజయ్‌కి తెలంగాణ బీజేపీ తెలంగాణ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఢిల్లీలో పదవీ బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ శుక్రవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి నాంపల్లి బీజేపీ కార్యాలయం వరకు అభిమానుల కోలాహలం కనిపించింది వేలాదిగా వచ్చిన అభిమానులతో కలిసి బండి సంజయ్ బిజెపి కార్యాలయం వరకు భారీ ర్యాలీ ద్వారా వచ్చారు. వేద పండితులు ఆయనకు ఆహ్వానం పలికారు బిజెపి మహిళా కార్యకర్తలు బండి సంజయ్‌కి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో బండి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్‌.. ‘వందల కిలోమీటర్లు నాతో నడిచిన సంగ్రామ సేనకు రుణపడి ఉంటాను. ఇంత పెద్ద అవకాశమిచ్చిన మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలకు ధన్యవాదాలు. ఎన్నికల యుద్ధ రంగంలో ఉన్నాం. కార్యకర్తల త్యాగాలను వృధాగా పోనివ్వము. గోల్‌కొండపై కాషాయ జెండాను రెపరెపలాడిస్తాం. బీజేపీలో గ్రూపులున్నాయని, పార్టీ గ్రాఫ్ తగ్గిందనేది కేవలం దుష్ప్రచారమే. మా మధ్య ఎలాంటి విబేధాలు లేవు, పార్టీని అధికారంలోకి తీసుకొని రావడమే మా లక్ష్యం. కిషన్ రెడ్డి నాయకత్వంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తాము’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇక బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో ఫైర్‌ అయ్యారు బండి సంజయ్‌. వర్షాలతో జనం విలవిల్లాడితే పరామర్శించని కేసీఆర్ మహారాష్ట్రలో రాజకీయాలు చేస్తున్నడన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసే మళ్లీ హామీల అమలు పేరుతో ఎన్నికల స్టంట్ చేస్తున్నడనన్నారు. రుణమాఫీ, వీఆర్ఏ, జేపీసీల క్రమబద్దీకరణ వంటి హామీలు ఎన్నికల డ్రామాలేనని విమర్శించారు. కేసీఆర్‌ను ఎవరు నమ్మరన్న బండి సంజయ్‌.. సర్కార్ దగ్గర పైసల్లేక ఎన్నికల తాయిలాల కోసం భూములను అమ్ముకునే దుస్థితి వచ్చిందన్నారు. ఈ ప్రభుత్వం ఉండేది మూడు నెలలలే అని పునరుద్ఘాటించారు బండి.

ఇక మద్యం టెండర్ల విషయంపై మాట్లాడిన బండి.. ‘గడువు ముగియకముందే మద్యం టెండర్ల ద్వారా వేల కోట్లు సంపాదించుకోవడం ఎన్నికల కోసమే’ అని విమర్శించారు. బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీకి ఊపుతెచ్చిన బండి సంజయ్‌ ఇప్పుడు కూడా అదే స్థాయిలో పనిచేస్తారో లేదో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..