Video: కోరిన కోర్కెలు తీరుస్తోన్న జలం.. క్యూ కడుతోన్న జనం.. ఎక్కడో తెలుసా?
పసుపు, కుంకుమ, పూలతో ప్రత్యేక పూజలు నిర్వహించి.. చెట్టు నుంచి బొట్లు బొట్లుగా జాలువారిని జలాన్ని తీర్థంలా ఒడిసి పట్టుకుని సేవించారు. కొబ్బరికాయలు కొట్టి రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ భక్తిని చాటుకున్నారు. ఈ విషయం పక్క గ్రామాలకు సైతం పాకడంతో ఈ వింతను చూడడానికి పరిసర గ్రామాల ప్రజలు సైతం తండోపతండాలుగా తరలి రావడం కనిపించింది.
నిర్మల్ జిల్లా రూరల్ మండలంలోని లంగ్డాపూర్ గ్రామం వద్ద రావి చెట్టు నుండి నీళ్లు దారాల వస్తుండటంతో జనం తండోపతండాలుగా ఆ ఆలయానికి తరలుతున్నారు. ఆ జలాన్ని తీర్థంలా సేవిస్తే కోరిన కోర్కెలు తీరుతాయన్న ప్రచారం జరగడటంతో ఆ జలాన్ని సేవించేందుకు భక్తులు క్యూ కడుతున్నారు. మానులోంచి దారలా జలం రావడంతో.. ఇది ఆ భగవంతుని లీల అంటూ.. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు. రావి చెట్టు నుంచి కారే నీటిని మహా తీర్థంగా భావించి సేవిస్తున్నారు.
లంగ్డాపూర్ గ్రామంలోని ఆంజనేయ ఆలయం ఆవరణలో గల రావి చెట్టు నుంచి అకస్మాత్తుగా నీళ్లు చుక్కలు చుక్కలుగా వస్తుండడం గుర్తించారు భక్తులు. ఈ వార్త ఈ నోట ఆ నోట ఊరంతా పాకడంతో పెద్ద ఎత్తున మహిళలు రావి చెట్టు వద్దకు పరుగులు తీశారు.
పసుపు, కుంకుమ, పూలతో ప్రత్యేక పూజలు నిర్వహించి.. చెట్టు నుంచి బొట్లు బొట్లుగా జాలువారిని జలాన్ని తీర్థంలా ఒడిసి పట్టుకుని సేవించారు. కొబ్బరికాయలు కొట్టి రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ భక్తిని చాటుకున్నారు. ఈ విషయం పక్క గ్రామాలకు సైతం పాకడంతో ఈ వింతను చూడడానికి పరిసర గ్రామాల ప్రజలు సైతం తండోపతండాలుగా తరలి రావడం కనిపించింది. అయితే, రావి చెట్టు నుంచి ఆ దార ఎలా వస్తుంది, ఇన్నేళ్లుగా లేని నీటి దార ఎక్కడి నుంచి వస్తుంది.. ఇదంతా ఆ రామయ్య లీలే అంటున్నారు భక్తులు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగిన మరుసటి రోజు నుండే ఈ నీటి దార కనిపించడంతో ఆ ప్రచారానికి మరింత ప్రాధాన్యత పెరిగింది. అయితే, కొందరు మాత్రం అది ప్రకృతి సిద్దంగా జరిగిన మార్పు మాత్రమే అని, మహిమ ఏమి లేదని కొట్టి పారేస్తున్నారు. ప్రకృతి ప్రతిచోటా అద్భుతాలను దాచిపెడుతుందని.. అప్పుడప్పుడు ఇలా మన కనుల ముందు ఆవిష్కరిస్తుందంటున్నారు.