Telangana: అద్భుత కళారూపం.. పోచంపల్లి ఇక్కత్ చీరలకు మరో ఆసియా అంతర్జాతీయ అవార్డు..

| Edited By: Jyothi Gadda

Dec 06, 2023 | 1:04 PM

నూతన డిజైన్లతో చేనేత వస్త్రాల తయారీ, ఉత్తమ మార్కెటింగ్‌, ఆన్‌లైన్‌ విక్రయాలు జరుపుతున్న భారత్‌తో పాటు శ్రీలంక, భూటాన్‌, మలేషియా, నేపాల్‌, కెన్యా, మల్దీవులు, మారిషస్‌ దేశాల నుంచి వ్యాపారవేత్తలు పోటీ పడ్డారు. ఇక్కత్ వస్త్రాలకు ఉత్తమ మార్కెటింగ్‌ కల్పించినందుకు ఈ ఏడాదిగానూ అవార్డును యాదాద్రి జిల్లా పోచంపల్లికి చెందిన ఇక్కత్ వరల్డ్ అధినేత గంజి యుగంధర్ కు బెస్ట్ హ్యాండ్లూమ్ అవార్డు లభించింది. తమిళనాడులోని

Telangana: అద్భుత కళారూపం.. పోచంపల్లి ఇక్కత్ చీరలకు మరో ఆసియా అంతర్జాతీయ అవార్డు..
Asia International Award for Pochampally Ikkat sarees
Follow us on

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి, కంచి పట్టుచీరలకు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి కేరాఫ్ అడ్రస్. పోచంపల్లి చేనేత కార్మికుల నైపుణ్యానికి ప్రతీక.. ఇక్కడి కంచి పట్టుచీరలు. చేనేత కార్మికుల సృజనాత్మకత, నూతన డిజైన్లతో చేనేత వస్త్రాల తయారీ, ఉత్తమ మార్కెటింగ్‌, ఆన్‌లైన్‌ విక్రయాలు చేపడుతున్న భూదాన్‌పోచంపల్లికి మరో ఆసియా అంతర్జాతీయ అవార్డు దక్కింది.

పోచంపల్లి పట్టుచీరలు ఖండాంతర ఖ్యాతిని ఆర్జించాయి. పోచంపల్లి చేనేత కార్మికుల నైపుణ్యానికి ప్రతీక.. ఇక్కడి కంచి పట్టుచీరలు. నాణ్యమైన పట్టు వార్పు డిజైన్ పట్టుచీర పోచంపల్లిలో చేనేత మగ్గంపై తయారు చేస్తారు. ఇక్కడ చేనేత కార్మికులు నేసిన పోచంపల్లి చీరలను నిలువు ఇక్కత్ చీరలు అని కూడా అంటారు. ఇక్కత్ చీర పోచంపల్లిలో తయారైన అద్భుత కళారూపం. చేనేత రంగంలో ఉత్తమ సేల్స్ మరియు తయారీకి, కొత్త డిజైన్లు సృజనాత్మకత ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విక్రయాల నిర్వహణకు ప్రతి ఏటా రూలా-ఆసియా సంస్ధ బెస్ట్ హ్యాండ్లూమ్ అవార్డును ప్రధానం చేస్తుంది.

నూతన డిజైన్లతో చేనేత వస్త్రాల తయారీ, ఉత్తమ మార్కెటింగ్‌, ఆన్‌లైన్‌ విక్రయాలు జరుపుతున్న భారత్‌తో పాటు శ్రీలంక, భూటాన్‌, మలేషియా, నేపాల్‌, కెన్యా, మల్దీవులు, మారిషస్‌ దేశాల నుంచి వ్యాపారవేత్తలు పోటీ పడ్డారు. ఇక్కత్ వస్త్రాలకు ఉత్తమ మార్కెటింగ్‌ కల్పించినందుకు ఈ ఏడాదిగానూ అవార్డును యాదాద్రి జిల్లా పోచంపల్లికి చెందిన ఇక్కత్ వరల్డ్ అధినేత గంజి యుగంధర్ కు బెస్ట్ హ్యాండ్లూమ్ అవార్డు లభించింది. తమిళనాడులోని తిరుచిరావలిలో రూలా-ఆసియా సంస్ధ నిర్వహించిన బిజినెస్‌ అవార్డు వేడుకల్లో ఆసియా బెస్ట్ హ్యాండ్లూమ్ అవార్డును గంజి యుగేందర్‌ అందుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా గంజి యుగేందర్‌ మాట్లాడుతూ అవార్డు వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. తన ఉన్నతికి, అవార్డు రావడానికి సహకరించిన చేనేత కళాకారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..