Telangana Elections: కర్ణాటక ఎన్నికల ముందు నువ్వు నా ఇంటికి ఎవరిని పంపావో పేరు చెప్పమంటావా.. రాహుల్‌గాంధీపై అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం
కర్నాటక ఎన్నికల సమయంలో నా ఇంటికి ఒకరిని పంపించావు.. ఆ రహస్యం ఏంటో చెప్పమంటావా అంటూ హెచ్చరించారు. రాహుల్‌గాంధీపై అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాపై కావాలనే రాహుల్ అవినీతి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటక ఎన్నికల ముందు నా ఇంటికి ఎవరిని పంపావో పేరు చెప్పమంటవా అంటూ అన్నారు. రేవంత్ ఓటుకు నోటు కేసుపై రాహుల్ ఎందుకు నోరు మెదపటం లేదో చెప్పాలా అంటూ ప్రశ్నించారు.
హైదరాబాద్, నవంబర్ 03: ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ముస్లిమీన్ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. కర్నాటక ఎన్నికల సమయంలో నా ఇంటికి ఒకరిని పంపించావు.. ఆ రహస్యం ఏంటో చెప్పమంటావా అంటూ హెచ్చరించారు. రాహుల్‌గాంధీపై అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాపై కావాలనే రాహుల్ అవినీతి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటక ఎన్నికల ముందు నా ఇంటికి ఎవరిని పంపావో పేరు చెప్పమంటవా అంటూ అన్నారు. రేవంత్ ఓటుకు నోటు కేసుపై రాహుల్ ఎందుకు నోరు మెదపటం లేదో చెప్పాలా అంటూ ప్రశ్నించారు. గురువారం నాడు తెలంగాణలో జరిగిన సభలో ఒవైసీ ప్రసంగిస్తూ, రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీలా వాగ్దానాలు చేయడం ప్రారంభించారని అన్నారు.
అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వచ్చారని, ప్యారే వచ్చి కేసీఆర్ అంత డబ్బు తీసుకున్నారని, మేం వచ్చి వాపస్ ఇస్తామని అంటే మోడీ 2 అయిపోయిందని’ అన్నారు. 2014లో అందరి అకౌంట్‌లో 15 లక్షలు వేస్తానని చెప్పిన మోడీ.. 15 లక్షలు కాకుండా 15 పైసలు రాకుంటే నేను చంపేస్తానని డైలాగ్‌ని చెప్పాడు. అందుకని నేను వస్తాను, బయటకి తీసుకెళ్తాను అన్నాడు.
#WATCH | Telangana: AIMIM MP Asaduddin Owaisi says, “…Their (Congress) leader Rahul Gandhi came here and said KCR took (people’s) money and will return the money. He has become Modi 2.O. In 2014, PM Modi had promised to deposit Rs 15 lakh into every citizen’s bank account but… pic.twitter.com/l37i4pYUNZ
— ANI (@ANI) November 2, 2023
తెలంగాణలోని అంబట్‌పల్లి గ్రామంలో జరిగిన సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజల నుంచి రూ.లక్ష కోట్లు దోచుకున్నారని, ఇక్కడ ఎవరూ లబ్ధి పొందలేదని రాహుల్ ప్రసంగించారు. అందుకే ఇక్కడ ఏం జరిగిందో నా కళ్లతో చూడాలనిపించాలన్నారు రాహుల్.
మరిన్ని తెలంగాణ వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి