AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KCR: మళ్లీ అదే సెంటిమెంట్ ఫాలో అవుతోన్న కేసీఆర్‌.. నామినేషన్‌ పత్రాలకు ప్రత్యేక పూజలు అక్కడే ఎందుకు..

బీఆర్‌ఎస్‌ అధినేత కూడా నామినేషన్‌ వేయడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే తాను ఎప్పటి నుంచో ఫాలో అవుతోన్న సెంటిమెంట్‌ను మరోసారి ఫాలో కావడానికి సిద్ధమయ్యారు. శనివారం కొనాయపల్లికి బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ రానున్నారు. మొదటి నుంచి కేసీఆర్‌కి సెంటిమెంట్ ఆలయం అయిన నంగునూర్ మండలం కొనయిపల్లి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నామినేషన్‌ పత్రాలకు...

KCR: మళ్లీ అదే సెంటిమెంట్ ఫాలో అవుతోన్న కేసీఆర్‌.. నామినేషన్‌ పత్రాలకు ప్రత్యేక పూజలు అక్కడే ఎందుకు..
CM KCR
P Shivteja
| Edited By: Narender Vaitla|

Updated on: Nov 03, 2023 | 12:33 PM

Share

తెలంగాణలో ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ వాతావరణం వేడెక్కుతోంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ శుక్రవారం విడుదలైంది. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్‌లు స్వీకరించనున్నారు. ఇక ఈ నెల 30వ తేదీన రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే నామినేషన్‌లు వేయడానికి నాయకులు సిద్ధమవుతున్నారు.

బీఆర్‌ఎస్‌ అధినేత కూడా నామినేషన్‌ వేయడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే తాను ఎప్పటి నుంచో ఫాలో అవుతోన్న సెంటిమెంట్‌ను మరోసారి ఫాలో కావడానికి సిద్ధమయ్యారు. శనివారం కొనాయపల్లికి బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ రానున్నారు. మొదటి నుంచి కేసీఆర్‌కి సెంటిమెంట్ ఆలయం అయిన నంగునూర్ మండలం కొనయిపల్లి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నామినేషన్‌ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్.

మొదటి నుంచి కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద నామినేషన్ పత్రాలు పెట్టీ ప్రత్యెక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తున్న విషయం అందరికి తెలిసిందే. కొనాయపల్లికి సీఎం కేసీఆర్ వస్తుండడంతో పోలీస్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు సిద్దం చేస్తున్నారు. హెలిప్యాడ్ కోసం స్థలం సిద్దం చేశారు.ఈ నెల 9న గజ్వేల్ , కామారెడ్డిలలో రెండు చోట్ల కేసీఆర్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఇదిలా ఉంటే కేసీఆర్‌కు ఈ ఆలయం ఇప్పటి సెంటిమెంట్‌ కాదు. ఏళ్లనాటి నుంచి ఇదొక ఆనవాయితీగా వస్తోంది. 1985లో మొదటిసారి సిద్దిపేట ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం 1989,94,1999, 2001, 2004,2009,2014, 2018లో పోటీ చేసిన ఎన్నికల్లో కూడా ఈ ఆలయంలోనే నామినేషన్ పత్రాలకు పూజ చేసి నామినేషన్లు దాఖలు చేశారు.

అంతేకాకుండా 2001లో డిప్యూటీ స్పీకర్ పదవికి టిడిపి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ పార్టీ స్థాపించినప్పుడు కూడా ఈ ఆలయంలోనే ప్రత్యేక పూజలు నిర్వహించి కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఇలా ప్రతి ముఖ్యమైన కార్యక్రమాన్ని మొదలు పెట్టేముందు ఈ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయడం కేసీఆర్‌కు ఆనవాయితీ, ఇప్పటికే కేసీఆర్‌ ఫామ్ హౌస్‌లో రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. శుక్రవారంతో ఈ యాగం పూర్తవుతుంది, ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం కోనాపూర్‌లోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకొని అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈనెల 9వ తేదీన గజ్వేల్ కామారెడ్డి అసెంబ్లీ స్థానాలకి నామినేషన్లను దాఖలు చేయనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..