Army Jawan: ఇండో- పాక్ సరిహద్దులో ఆర్మీ జవాన్ అనుమానాస్పద మృతి.. కరీంనగర్‌లో విషాదఛాయలు..!
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గొడిసాల గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ నెల్లి రామకృష్ణ (27) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. భారత సరిహద్దులో ఆర్మీ క్యాంప్ బాత్రూంలో విగతజీవిగా కనిపించాడు. దీంతో భారత సైనిక అధికారులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. రామకృష్ణ మృతి పట్లు ఆయన కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రామకృష్ణ భౌతికకాయంను నేడు ఆయన స్వగ్రామానికి చేర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గొడిసాల గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ నెల్లి రామకృష్ణ (27) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. భారత సరిహద్దులో ఆర్మీ క్యాంప్ బాత్రూంలో విగతజీవిగా కనిపించాడు. దీంతో భారత సైనిక అధికారులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. రామకృష్ణ మృతి పట్లు ఆయన కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రామకృష్ణ భౌతికకాయంను నేడు ఆయన స్వగ్రామానికి చేర్చేందుకు అధికారులుఏర్పాట్లు చేశారు.
సైదాపూర్ మండలం గొడిసాల గ్రామానికి చెందిన రామకృష్ణ గత ఐదు సంవత్సరాల క్రితం ఆర్మీ ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం పంజాబ్ ప్రాంతంలో ఇండో- పాక్ సరిహద్దు వద్ద విధులు నిర్వహిస్తున్నారు. శనివారం తెల్లవారు జామున కాలకృత్యాలు తీర్చుకునేందుకు బాత్రూమ్‌లోకి వెళ్ళిన రామకృష్ణ మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. కాగా జవాన్ మృతదేహాన్ని ఆదివారం ఉదయం స్వగ్రామానికి పంపిస్తామని ఆర్మీ అధికారులు తెలిపినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.
గొడిసాలలో నేడు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రామకృష్ణ అనుమానాస్పద మరణంతో ఆయన కుటుంబసభ్యులు, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రామకృష్ణ అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. రామకృష్ణ చనిపోయాడంటే నమ్మలేకపోతున్నామన్నారు ఆయన స్నేహితులు గ్రామస్తులు. జవాన్ మరణంతో గొడిసాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జవాన్ మృతి పట్ల బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…