Telangana: మేడారం మహాజాతర వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ప్రత్యేక యాప్‎తో రూట్ మ్యాప్..

మేడారం మహా జాతరకు రూట్ మ్యాప్ రెడీ అయింది. 6వేల బస్సులు, దాదాపు రెండు లక్షలకు పైగా ప్రైవేటు వాహనాలు, హెలికాప్టర్లు, ఎడ్ల బండ్లు.. ఇలా అన్నిదారులు మేడారం వైపే.. మరి సమ్మక్క సారక్క సన్నిధికి చేరే దారేది.? ఈ సారి జాతర రూట్ మ్యాప్ ఏంటి.? రెండేళ్లకోసారి జరిగే మేడారం మహాజాతరకు.. మరికొద్దిరోజులే మిగిలున్నాయి. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు సమ్మక్క-సారలమ్మ జాతర జరగనుంది.

Telangana: మేడారం మహాజాతర వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ప్రత్యేక యాప్‎తో రూట్ మ్యాప్..
Medaram Jatara Special App

Updated on: Feb 15, 2024 | 12:14 PM

మేడారం మహా జాతరకు రూట్ మ్యాప్ రెడీ అయింది. 6వేల బస్సులు, దాదాపు రెండు లక్షలకు పైగా ప్రైవేటు వాహనాలు, హెలికాప్టర్లు, ఎడ్ల బండ్లు.. ఇలా అన్నిదారులు మేడారం వైపే.. మరి సమ్మక్క సారక్క సన్నిధికి చేరే దారేది.? ఈ సారి జాతర రూట్ మ్యాప్ ఏంటి.? రెండేళ్లకోసారి జరిగే మేడారం మహాజాతరకు.. మరికొద్దిరోజులే మిగిలున్నాయి. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు సమ్మక్క-సారలమ్మ జాతర జరగనుంది. మేడారం జాతర చరిత్రలో ఇప్పటివరకు కోటి 20 లక్షల మంది హైయెస్ట్‌ రికార్డ్‌గా ఉంది. ఈసారి జాతరకు కోటి 50 లక్షల మంది భక్తులు వస్తారని.. అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం జాతరకు భారీ ఏర్పాట్లు చేసింది. స్థానిక మంత్రి, ఆదివాసి బిడ్డ సీతక్క అన్ని తానై మేడారం సమ్మక్క సారక్క జాతరకు ఏర్పాట్లు చేస్తున్నారు. సమ్మక్క-సారక్క దేవతల దీవెనలతోనే తాను ఈ స్థాయికి ఎదిగానని తల్లుల సేవలో తరిస్తున్నారామె. జాతర సమయంలో తెలుగు రాష్ట్రాలు సహా.. ఆరు రాష్ట్రాల నుంచి భక్తులు తల్లుల దర్శనానికి భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. అందుకు తగ్గట్లే.. మేడారానికి వచ్చే ప్రతీ మేజర్ రూట్‌లో ఏర్పాట్లు చేశారు. ఏ రూట్లో వస్తే సమ్మక్క సారక్క సన్నిధికి త్వరగా చేరుకుంటారు.? వీఐపీలు, ఆర్టీసీ బస్సులను ఏ రూట్లో మేడారానికి రావాలి, ఎడ్లబండ్లు ఏ మార్గంలో వెళ్లాలనే రూట్ మ్యాప్ సిద్ధం చేశారు అధికారులు.

జాతర సమయంలో పస్రా – తాడ్వాయి మీదుగా మేడారం రూట్‌లో కేవలం ఆర్టీసీ బస్సులు,VVIPల వాహనాలు మాత్రమే అనుమతిస్తారు. హైదరాబాద్, విజయవాడ, కరీంనగర్, మహారాష్ట్ర హైవే మీదుగా వరంగల్ చేరుకునే వాహనాలు ములుగు మీదుగా మేడారం చేరుకునేలా రూట్ మ్యాప్ రెడీ చేశారు. అయితే ప్రైవేటు వాహనాలను పస్రా – ప్రాజెక్ట్ నగర్, నార్లపూర్ మీదుగా మేడారం వైపు దారి మళ్లిస్తారు. ఛత్తీస్‌ఘడ్‌ నుంచి వచ్చే ప్రైవేట్ వాహనాలను ఏటూరు నాగారం, చిన్నబోయినపల్లి, కొండాయి మీదుగా దారి మళ్లిస్తారు. మహారాష్ట్ర, గోదావరిఖని, మంథని, భూపాలపల్లి మీదుగా వచ్చే ప్రైవేట్ వాహనాలకు కాల్వపల్లి మార్గంలో ఒక దారి.. బయ్యక్కపేట నుంచి మరో రెండు మార్గాల్లో మేడారం చేరుకునేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశామన్నారు. మేడారం చుట్టూ 8 కిలోమీటర్ల మేర 33 ప్రాంతాల్లో పార్కింగ్‌కు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేక బస్టాండ్‌తో పాటు.. 14 వేల మంది పోలీసులు, 500 సీసీ కెమెరాలు, 12 డ్రోన్ కెమెరాలతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక మేడారం సమ్మక్క సారక్క దేవతలు కొలువైన గద్దెల దగ్గర క్యూ లైన్లలో ఏకకాలంలో 20 వేల మంది వెయిట్ చేసేలా భారీ క్యూ లైన్లు సిద్ధం చేశారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి నేరుగా గద్దెల దగ్గరకు చేరుకునేలా సపరేట్ క్యూలైన్లు కూడా రెడీ చేశారు. ఇంటర్ నెట్ రాకున్నా.. భక్తులు రూట్ మ్యాప్ తెలుసుకునేలా.. జీపీఎస్‌తో ప్రత్యేక యాప్ తయారు చేస్తున్నామన్నారు కలెక్టర్.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..