AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Water Level: ప్రాజెక్టులకు జలకళ… కృష్ణా, గోదావరి నదులకు వరద ప్రవాహం

తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు నిండు కుండను తలపిపిస్తున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో కృష్ణా నది, గోదావరి నది కింద ఉన్న ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో తుంగభద్ర డ్యాంకు కృష్ణమ్మ బిరబిరా పరుగులు...

Water Level: ప్రాజెక్టులకు జలకళ... కృష్ణా, గోదావరి నదులకు వరద ప్రవాహం
Srisailam Dam
K Sammaiah
|

Updated on: Jul 11, 2025 | 8:11 AM

Share

తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు నిండు కుండను తలపిపిస్తున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో కృష్ణా నది, గోదావరి నది కింద ఉన్న ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి.

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో తుంగభద్ర డ్యాంకు కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతోంది. దీంతో ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతుండడంతో 11 గేట్లు ఎత్తివేత నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రజెంట్ తుంగభ్రదకు ఇన్‌ ఫ్లో 42వేల 290 క్యూసెక్కులు కాగా.. అవుట్‌ ఫ్లో 40వేల 231 క్యూసెక్కులుగా ఉంంది. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1624.86 అడుగులుఉంది.

తుంగభద్ర డ్యాం నుంచి కర్నూలు జిల్లా సుంకేసుల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. సుంకేసుల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో జలకళ సంతరించుకుంది. ప్రజెంట్ 13గేట్లు ఎత్తి శ్రీశైలం జలాశయానికి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 1.20 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 0.68 టీఎంసీలుగా ఉంది.

శ్రీశైలం డ్యామ్ కు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తినీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణమ్మ నాగార్జునసాగర్ వైపు పరుగులు పెడుతోంది. శ్రీశైలం జలాశయానికి మొత్తంగా ఇన్ ఫ్లో 1 లక్ష 48 వేల 696 క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 1 లక్ష 48 వేల 734 క్యూసెక్కులుగా ఉంది శ్రీశైలం జలాశయం పూర్తిస్దాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.80 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 203. టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడి ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో కొనసాగుతుంది.

శ్రీశైలం ప్రాజెక్ట్‌ నుంచి నీటిని విడుదల చేయడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 1,18,167, ఔట్ ఫ్లో 5,612 క్యూసెక్కులుగా ఉన్నాయి. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 543.60 అడుగులకు చేరుకుంది. నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్‌కు భారీగా వరద చేరుతుంది. ఒక్క గేటును ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 693 అడుగులకు చేరుకుంది. ఇన్‌ ఫ్లో 4,433, ఔట్‌ ఫ్లో 4,346 క్యూసెక్కులుగా ఉంది.