Telangana Election: అజారుద్దీన్‌కి మరో గట్టి ఎదురుదెబ్బ.. ఎంఐఎం షాకింగ్ నిర్ణయం
ఎంఐఎం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది? పాతబస్తీతో పాటు బలం ఉన్న నియోజకవర్గాల్లో సత్తా చాటాలనుకుంటోందా? అన్న అంశాలకు క్లారిటీ ఇచ్చేశారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాతబస్తీతో పాటు 9 చోట్ల పోటీ చేయాలని నిర్ణయించారు. మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ పోటీ చేసే జూబ్లీహిల్స్ సెగ్మెంట్‌లోనూ ఎంఐఎం పోటీకి దిగుతోంది.

ఎంఐఎం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది? పాతబస్తీతో పాటు బలం ఉన్న నియోజకవర్గాల్లో సత్తా చాటాలనుకుంటోందా? అన్న అంశాలకు క్లారిటీ ఇచ్చేశారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాతబస్తీతో పాటు 9 చోట్ల పోటీ చేయాలని నిర్ణయించారు. మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ పోటీ చేసే జూబ్లీహిల్స్ సెగ్మెంట్‌లోనూ ఎంఐఎం పోటీకి దిగుతోంది.
ఇప్పటి వరకు ఏడు అసెంబ్లీ స్థానాలకే పరిమితమైన ఎంఐఎం పార్టీ.. ఈ సారి మరో రెండు కొత్త నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్లు ఎంఐఎం అధినేత అసద్ ప్రకటించారు. ప్రస్తుతం ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తోన్న పాతబస్తీలోని చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకత్‌పూరా, బహదూర్‌పూరా, నాంపల్లి, కార్వాన్, మలక్‌పేట్‌తో పాటు ఈసారి కొత్తగా జూబ్లీహిల్స్, రాజేంద్ర నగర్ నియోజకవర్గాల్లోనూ తమ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నట్లు ప్రకటించారు పార్టీ అధినేత.
మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడకుండా గండి కొట్టేందుకు ఎంఐఎం ఇలాంటి స్ట్రాటజీ అప్లై చేస్తోందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. పైగా ఈసారి కాంగ్రెస్ నుంచి టఫ్ ఫైట్ ఉండొచ్చనే ప్రచారం జరుగుతుండడంతో.. ఎంఐఎం జాగ్రత్త పడుతోందని, సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తోందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఎంఐఎం ఈసారి నలుగురు సిట్టింగులను మారుస్తోందనే వార్త బయటిచ్చే సరికి అంతా షాక్ అవుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ భారత క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్ పోటీ చేస్తున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం కూడా ఉండటం విశేషం. అయితే ఇక్కడ ఎంఐఎం అభ్యర్థి బరిలో దిగతుండటంతో అజారుద్దీన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందంటున్నారు ఎక్స్‌ఫర్ట్స్.
ఇప్పటివరకు అధికార పార్టీకి ఎంఐఎం మిత్రపక్షంగా కొనసాగుతుంది. అనేక సభల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం ఎంఐఎంతో కలిసి ఉంటామని పదే పదే చెబుతున్నారు. అయితే ప్రస్తుం జూబ్లీహిల్స్, రాజేంద్ర నగర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోటీలో ఉన్నారు. ఈ రెండు సెగ్మెంట్లలో ఈసారి అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో మధ్య హోరాహోరీ ఉండగా.. ఎంఐఎం ఎంట్రీతో పోరు మరింత రసవత్తరంగా మారనుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే తెలంగాణలో ఎంఐఎం నాలుగో ప్రధాన పార్టీగా ఎదుగుతుందని ఎంఐఎం అధినేత ఇటీవల సంగారెడ్డిలో నిర్వహించిన సభలో స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎంఐఎం పవర్ ప్లేయర్ పాత్ర పోషించబోతున్నట్లు తెలిపారు. 9 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన ఓవైసీ.. నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైనప్పటికీ అభ్యర్థులను మాత్రం ఖరారు చేయలేదు. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశముంది.
సిట్టింగులను మారుస్తున్నారు అనే న్యూస్ బయటికొచ్చే సరికి.. పాతబస్తీలోని వారికే కాదు టికెట్ పక్కా అనుకున్న వారిలోనూ గుబులు పుడుతోంది. టికెట్ వస్తుందా రాదా అనే విషయంలో నరాలు తెగే ఉత్కంఠ ఉంది. కాకపోతే, ఒకటి. పార్టీలో ఏం జరిగినా, ఏ నిర్ణయం తీసుకున్నా అది ఓవైసీ బ్రదర్స్ నోటి నుంచి రావాల్సిందే. వాళ్ల నుంచి బయటకు వచ్చిన వాయిసే నిజం. మిగిలినవన్నీ ఊహాగానాలే. కాకపోతే, సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తారనే ప్రచారం జరుగుతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…