AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PV District: మరో ఉద్యమానికి సిద్ధమైన హుజురాబాద్.. ఇప్పటికే పీవీ జిల్లా సాధన సమితి ఏర్పాటు

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు పేరుతో జిల్లాని ఏర్పాటు చేయాలని డిమాండ్ రోజురోజుకి పెరుగుతుంది. అప్పటి ప్రభుత్వం జిల్లాల పునర్విభజన సమయంలో హుజురాబాద్ కేంద్రం గా పీవీ నరసింహారావు జిల్లాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.అంతేకాకుండా అందోళన ‌కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయినా ఫలించలేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మరోసారి పీవీ జిల్లా తెరపైకి వచ్చింది..

PV District: మరో ఉద్యమానికి సిద్ధమైన హుజురాబాద్.. ఇప్పటికే పీవీ జిల్లా సాధన సమితి ఏర్పాటు
Pv Narasimha Rao
G Sampath Kumar
| Edited By: |

Updated on: Jan 30, 2024 | 11:50 AM

Share

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు పేరుతో జిల్లాని ఏర్పాటు చేయాలని డిమాండ్ రోజురోజుకి పెరుగుతుంది. అప్పటి ప్రభుత్వం జిల్లాల పునర్విభజన సమయంలో హుజురాబాద్ కేంద్రం గా పీవీ నరసింహారావు జిల్లాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.అంతేకాకుండా అందోళన ‌కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయినా ఫలించలేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మరోసారి పీవీ జిల్లా తెరపైకి వచ్చింది..

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కేంద్రంగా పీవీ నరసింహారావు జిల్లాని ఏర్పాటు చేయాలని మేధావులతో పాటు ప్రజాసంఘాలు డిమాండ్ చెస్తున్నాయి. మాజీ ప్రధాని పీవీ భీమదేవరపల్లి మండలం వంగరలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం ఇక్కడి నుండే మొదలు అయ్యింది. అయన జ్ఞాపకాల గుర్తుగా హుజురాబాద్ కేంద్రంగా పీవీ జిల్లాని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాలా రోజుల నుండి ఉంది. గత బీఅర్ఎస్ ప్రభుత్వం పది జిల్లాల నుండి ముప్పై మూడు జిల్లాలకి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అ సమయంలోనే పీవీ జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ పెరిగింది.

ఈక్రమంలోనే పీవీ జిల్లా సాధన సమితిని కూడా జేఏసి నేతలు ఏర్పాటు చేశారు. అప్పట్లో హుజురాబాద్ కేంద్రంగా నెల రోజులపాటు అందోళన కార్యక్రమాలు జరిగాయి. అప్పటి రాష్ట్ర మంత్రి‌ ఈటెల రాజేందర్ జోక్యం చేసుకుని అందోళన విరమింపజేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తానని హామీ‌ ఇచ్చారు. అయితే హుజురాబాద్ జిల్లా కేంద్రం ‌కాకుండా డివిజన్ కేంద్రంగా మారింది. మళ్ళీ ‌ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో జిల్లాల పునర్విభజనపై చర్చ జరుగుతోంది ఈ క్రమంలో మరోసారి పీవీ జిల్లా తెరపైకి వచ్చింది.

హుజురాబాద్ కేంద్రంగా పదిహేను మండలాలని కలుపుతూ పీవీ జిల్లాని ఏర్పాటు చేయాలని మేధావులతో పాటుగా ప్రజా‌సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎర్పడిన‌ తరువాత మొదటిసారిగా హుజురాబాద్‌లో పీవీ జిల్లా సాధన‌ సమితి‌‌ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ‌ సమావేశానికి ప్రోఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాం హాజరు అయ్యారు. అయన‌ సైతం పీవీ జిల్లాని‌ ఏర్పాటు చేయాలని సూచించారు. పీవీ జిల్లాపై ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పీవీ చేపట్టిన అర్థిక‌ సంస్కరణలు భూ సంస్కరణలు చేపట్టారని ప్రస్తావించారు.

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని జిల్లాలని మార్చడం, లేదంటే కుదించడంపై చర్చ సాగుతుంది. పరిపాలన సౌలభ్యంగా ఉండే జిల్లాలని ఏర్పాటు చేసేందుకు‌ సుముఖంగా ఉన్నట్లు ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది. పీవీ జిల్లా ఏర్పాటుకు ప్రతిపక్షాలు‌ కూడా మద్దతు ఇవ్వడంతో ఏదైనా‌ ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. పీవీ సేవలు‌ గుర్తుండే విధంగా అయన‌ పేరుతో జిల్లా‌ కేంద్రాన్ని‌ ఏర్పాటు చేయాలని జేఏసి నేతలు డిమాండ్ చేస్తున్నారు.

అరేళ్ళుగా ఉద్యమాలు చేస్తున్నామని చెబుతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి పీవీ జిల్లాని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. పీవీ జిల్లా కోసం ఎనిమిది ఏళ్ళుగా పోరాటం సాగుతుందని ఎమ్మెల్సీ ‌కోదండరాం అంటున్నారు. అయన పేరు పైనా జిల్లా ఏర్పటుపై సర్వరమే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us