వంటగదిలో చీమలతో విసిగిపోయారా? చిటికెడు కాఫీ పొడితో సమస్యకు చెక్‌

05 May 2026

TV9 Telugu

TV9 Telugu

కాఫీ మెదడు, గట్, లివర్ ఆరోగ్యానికి మేలు చేస్తుంద‌ని, పాలీఫినాల్స్ మంచి బ్యాక్టీరియాను పెంచుతాయని, దృష్టి కేంద్రీకరణను మెరుగుపరుస్తాయని, అలాగే అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చట. మరణాల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది

TV9 Telugu

కాఫీ బద్ధకాన్ని, నిరుత్సాహాన్ని తరమికొట్టే పానియం మాత్రమే కాదు కప్పు కాఫీ రోజంతా ఉల్లాసంగా ఉండేందుకు ఉత్తేజపరుస్తుంది. కానీ కాఫీ ఆరోగ్యానికే కాదు మరెన్నో ప్రయోజనాలకు కూడా ఉపయోగపడుతుందని మీకు తెలుసా? 

TV9 Telugu

కాఫీ పొడి జుట్టుకు సహజమైన లేత గోధుమ రంగును, మెరుపును ఇస్తుంది. దీనిని హెన్నాతో కలపవచ్చు లేదా కాఫీ నీటితో జుట్టును కడగవచ్చు. ఇలా చేయడం వల్ల జుట్టుకు సహాజ కండీషనర్‌గా కాఫీ పనిచేస్తుంది

TV9 Telugu

ఇంట్లో రిఫ్రిజిరేటర్ నుండి వింత వాసన రావడం మొదలైతే ఒకటి లేదా రెండు చిన్న గిన్నెల నిండా పొడి కాఫీ పొడిని రిఫ్రిజిరేటర్‌లో పెట్టండి. 24 గంటల పాటు దానిని అలాగే ఉంచితే వాసన పోతుంది

TV9 Telugu

మెషిన్ ఉపయోగించి కాఫీ తయారు చేసినా లేదా కాఫీ షాప్ నడుపుతున్నా మిగిలిపోయిన కాఫీ పొడిని పారేయకుండా గార్డెన్‌లో మొక్కలకు ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల కీటకాలు దూరంగా ఉండటంతో పాటు నేల నాణ్యత కూడా మెరుగుపడుతుంది

TV9 Telugu

ఫర్నిచర్‌ను మరమ్మత్తు చేయడానికి సైతం కాఫీ పొడిని ఉపయోగించవచ్చు. ఒకవేళ చిన్న పగులు లేదా గుంత కనిపిస్తే కాఫీ పొడిని జిగురుతో కలిపి ఆ ఖాళీని పూరించవచ్చు. ఆ తర్వాత దానిని ఇసుక కాగితంతో రుద్ది, కొద్దిగా కొబ్బరి నూనెను రాస్తేసరి.. ఫర్నిచర్ మరమ్మత్తు పూర్తవుతుంది

TV9 Telugu

కాఫీ చర్మానికి కూడా మేలు చేస్తుంది. దీనిని కొబ్బరి నూనె, కలబంద జెల్‌తో కలిపి స్క్రబ్‌గా ఉపయోగించవచ్చు. ఇది చర్మంపై ఉన్న టానింగ్, మృత కణాలు, మలినాలను లోతుగా శుభ్రపరుస్తుంది

TV9 Telugu

వేసవి కాలంలో తరచుగా ఇళ్లలోకి చేరే చీమలు నుంచి ఉపశమనం పొందడానికి చీమలు ఉన్న ప్రదేశం చుట్టూ కాఫీ పొడితో ఒక గీతలా గీయండి. దాని ఘాటైన వాసన వల్ల చీమలు అక్కడి నుంచి వెళ్లిపోతాయి