IPL 2026 Playoffs : ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుదల.. బెంగళూరుకు షాక్.. అహ్మదాబాద్‌లో ఫైనల్ ఫైట్
IPL 2026 Playoffs : ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంది. క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్లేఆఫ్స్ షెడ్యూల్‌ను బీసీసీఐ (BCCI) అధికారికంగా ప్రకటించింది. అయితే , ఈసారి వేదికల విషయంలో బోర్డు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.

IPL 2026 Playoffs : ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంది. క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్లేఆఫ్స్ షెడ్యూల్‌ను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈసారి వేదికల విషయంలో బోర్డు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా డిఫెండింగ్ ఛాంపియన్ సొంత గడ్డపై జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వేదిక మారింది. బెంగళూరు ఫ్యాన్స్‌కు షాక్ ఇస్తూ, ఫైనల్ పోరు అహ్మదాబాద్‌కు తరలిపోయింది.
ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంది. క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్లేఆఫ్స్ షెడ్యూల్‌ను బీసీసీఐ (BCCI) అధికారికంగా ప్రకటించింది. అయితే, ఈసారి వేదికల విషయంలో బోర్డు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా డిఫెండింగ్ ఛాంపియన్ సొంత గడ్డపై జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వేదిక మారింది. బెంగళూరు ఫ్యాన్స్‌కు షాక్ ఇస్తూ, ఫైనల్ పోరు అహ్మదాబాద్‌కు తరలిపోయింది.
నిజానికి ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. గత సీజన్ విజేత (డిఫెండింగ్ ఛాంపియన్) అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) హోమ్ గ్రౌండ్‌లో ఫైనల్ జరగాలి. అంటే ఈసారి చిన్నాస్వామి స్టేడియం ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే, స్థానిక అసోసియేషన్, అధికారుల నుంచి వచ్చిన కొన్ని డిమాండ్లు బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో బోర్డు వేదికను మార్చేసింది. బీసీసీఐ మార్గదర్శకాలకు మించి ఉన్న కొన్ని అంశాల వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని బోర్డు స్పష్టం చేసింది.
ప్లేఆఫ్స్ వేదికలు ఇవే
ఈసారి ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు మూడు విభిన్న వేదికలలో జరగనున్నాయి.
క్వాలిఫైయర్ 1 (మే 26): టేబుల్ టాప్ టూ జట్ల మధ్య పోరు హిమాచల్ ప్రదేశ్‌లోని అందమైన ధర్మశాల (HPCA) స్టేడియంలో జరుగుతుంది.
ఎలిమినేటర్ (మే 27): మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య మ్యాచ్ న్యూ చండీగఢ్‌లోని కొత్త ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నిర్వహిస్తారు.
క్వాలిఫైయర్ 2 (మే 29): క్వాలిఫైయర్ 1లో ఓడిన జట్టు, ఎలిమినేటర్ విజేతతో ఇదే చండీగఢ్ వేదికగా తలపడుతుంది.
ఫైనల్ (మే 31): గ్రాండ్ ఫైనల్ ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియమైన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది.
70 లీగ్ మ్యాచ్‌ల తర్వాత ఐపీఎల్ 2026 ఇప్పుడు తుది దశకు చేరుకుంది. ధర్మశాల వంటి చల్లని ప్రదేశంలో క్వాలిఫైయర్ నిర్వహించడం ద్వారా క్రికెట్ అభిమానులకు సరికొత్త అనుభూతిని అందించాలని బీసీసీఐ భావిస్తోంది. అలాగే చండీగఢ్‌లోని కొత్త స్టేడియం ఈసారి ప్లేఆఫ్స్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కానుంది. బెంగళూరులో స్థానిక అడ్మినిస్ట్రేటివ్ సమస్యల వల్ల ఫైనల్ మిస్ అవ్వడం ఆర్సీబీ ఫ్యాన్స్‌ను కొంత నిరాశకు గురిచేసినా, అహ్మదాబాద్‌లో లక్ష మంది సమక్షంలో జరిగే ఫైనల్ పోరు అదిరిపోవడం ఖాయం.
మే 31న జరగబోయే ఫైనల్ మ్యాచ్ కోసం టిక్కెట్ల వేట అప్పుడే మొదలైపోయింది. లాజిస్టికల్ కారణాల వల్ల ఈసారి ప్లేఆఫ్స్ వేదికల్లో మార్పులు చేసినట్లు బీసీసీఐ తన అధికారిక ప్రకటనలో తెలిపింది. ఏది ఏమైనా, ఈ సీజన్ ఛాంపియన్ ఎవరో తేలడానికి మరికొద్ది రోజులే సమయం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్
