AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jonna Bhuvva: పాతకాలంనాటి ఆరోగ్యకరమైన జొన్న బువ్వ.. తింటే శక్తికి.. శక్తి.. తృప్తికి.. తృప్తి

ఈ రోజుల్లో ఆరోగ్యం పట్ల అందరికీ శ్రద్ధ పెరిగింది. హాస్పిటల్‌కి వెళ్తే డాక్టర్లు మొదటగా చెప్పే మాట—తెల్లటి అన్నం తినడం తగ్గించమని. డయాబెటిస్ ఉన్నవారికే కాదు, బరువు తగ్గాలనుకునే ప్రతి ఒక్కరికీ రైస్ మానేయడం ఒక పెద్ద సవాలుగా మారుతోంది. అయితే, అన్నం తినలేకపోతున్నామనే ఫీలింగ్ లేకుండా, అంతే తృప్తిగా, అంతకంటే ఎక్కువ బలంతో మన పాతకాలపు వంటకాలను అలవాటు చేసుకోవడం ఎంతో మంచిది.

Phani CH
|

Updated on: Jul 06, 2026 | 10:20 PM

Share
మన అమ్మమ్మలు, నానమ్మల కాలంలో ఎంతో ఇష్టంగా వండుకుని తిన్న (జొన్న అన్నం) శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది వెజ్ మరియు నాన్-వెజ్ కూరల్లోకి అద్భుతంగా ఉంటుంది.  దీని తయారీకి మొదటగా రెండు గ్లాసుల పచ్చ జొన్నలను తీసుకుని, వాటిలోని ధూళి పోయేలా నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయానికి జొన్నలు బాగా నాని ఉంటాయి. ఇప్పుడు ఆ నీటిని పూర్తిగా వడకట్టేసి, జొన్నలను కొద్దిగా ఆరనివ్వాలి.

1 / 5
జొన్నలు కొద్దిగా పొడిగా అయిన తర్వాత, వాటిని రోట్లో వేసి ఒక రెండు నిమిషాల పాటు దంచుకోవాలి. ఇలా దంచడం వల్ల జొన్నల పైన ఉండే పొట్టు సులువుగా ఊడిపోతుంది. రోలు లేనివారు మిక్సీ జార్‌లో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవచ్చు. దంచిన తర్వాత ఒక చాటలోకి తీసుకుని పొట్టును పూర్తిగా చెరిగి వేరు చేయాలి. ఇలా చేయడం వల్ల జొన్న బువ్వ ముద్దలు కాకుండా నీట్‌గా వస్తుంది. మిగిలిన నూకను మిక్సీలో మరీ మెత్తగా కాకుండా బరకగా పట్టుకోవాలి.

2 / 5
ఇప్పుడు స్టవ్‌పై అడుగు మందంగా ఉన్న గిన్నె లేదా మట్టి కుండ పెట్టుకుని, రెండు గ్లాసుల జొన్న నూకకు ఏడు గ్లాసుల నీళ్లు పోయాలి. జొన్నలు ఉడకడానికి కాస్త ఎక్కువ సమయం మరియు నీళ్లు పడతాయి. నీటిలో ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా మరగనివ్వాలి. ఎసరు మరుగుతున్నప్పుడు మనం సిద్ధం చేసుకున్న జొన్న నూకను వేస్తూ, ఉండలు కట్టకుండా కలుపుకోవాలి.

3 / 5
మంటను పూర్తిగా లో-ఫ్లేమ్‌లో ఉంచి, మూత పెట్టి మధ్యమధ్యలో కలుపుతూ ఇరవై నిమిషాల పాటు ఉడికించాలి. అడుగంటకుండా జాగ్రత్తపడాలి. జొన్న నూక మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి, పది నిమిషాలు అలాగే వదిలేయాలి. చల్లారే కొద్దీ అది గట్టిపడి పర్ఫెక్ట్ ముద్దలా తయారవుతుంది.  ఈ కమ్మని జొన్న బువ్వను అరటికాయ పులుసు, పప్పుచారు, తోటకూర పులుసు లేదా చికెన్, మటన్ లాంటి నాన్-వెజ్ కూరలతో తింటే అద్భుతంగా ఉంటుంది.

4 / 5
అంతేకాదు, మిగిలిన జొన్న బువ్వను ముద్దలు చేసి రాత్రి మజ్జిగలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం ఉల్లిపాయ నంచుకుని తింటే కడుపులో ఎంతో చల్లగా ఉంటుంది. ఇడ్లీ, దోసల కంటే ఈ చద్దన్నం ఆరోగ్యానికి ఎంతో శ్రేష్ఠం. మన పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే ఇలాంటి సంప్రదాయ వంటకాలను అలవాటు చేద్దాం!

5 / 5
Follow Us
అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక..

వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే

క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి

వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు

మరోసారి గొప్ప మనసు చాటుకున్న మోహన్ బాబు.. ఏం చేశారంటే? వీడియో

టెన్షన్‌తో సతమతమవుతున్నారా? ఈ ఆసనాలు మస్ట్ ట్రై

జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు

రోజూ 3 గుడ్లు తింటే మీ శరీరంలో జరిగే మార్పులివే?

ఎయిర్‌పోర్టు తరహాలో రాష్ట్రవ్యాప్తంగా 13 కొత్త బస్టాండ్స్!
ఎయిర్‌పోర్టు తరహాలో రాష్ట్రవ్యాప్తంగా 13 కొత్త బస్టాండ్స్!
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!

'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్

‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?

400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్

నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?

టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌