మామిడి పండ్లను ఇలా తిన్నారంటే.. మీ కథ కంచికే!

05 May 2026

TV9 Telugu

TV9 Telugu

మామిడి రుచులు ఆస్వాధించేందుకు మనలో చాలా మంది ఏడాదంతా ఎదురు చూస్తుంటారు. రుచిగా ఉండటమేకాకుండా పోషకాలు కూడా పుష్కలంగా ఉండే మామిడి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి

TV9 Telugu

కప్పు మామిడి ముక్కల్లో సుమారు 165 గ్రాముల మామిడి పండులో 99 కేలరీలు, ప్రోటీన్ (1.4 గ్రాములు), కార్బోహైడ్రేట్లు (24.8 గ్రాములు), కొవ్వు (0.6 గ్రాములు), ఫైబర్ (2.6 గ్రాములు), చక్కెర (22.6 గ్రాములు), విటమిన్ సి లో 67 శాతం ఉంటాయి

TV9 Telugu

వేసవిలో రోజూ మామిడి పండ్లు తినే అలవాటు ఉన్న వారు తెలిసో తెలియకో ఇతర ఆహారాలతో వీటిని కలిపి తింటుంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందట

TV9 Telugu

 ఫ్రూట్ చాట్ తింటున్నట్లయితే పొరపాటున మామిడి పండ్లతో పాటు నిమ్మజాతి పండ్లను తినకూడదు. దీనివల్ల కడుపులో రసాయన ప్రతిచర్య జరుగుతంది

TV9 Telugu

మామిడి మిల్క్‌ షేక్‌లు తయారు చేసుకుని తాగితే పైత్యరస సంబంధిత రుగ్మతలను మరింత తీవ్రతరం చేస్తుందట. మామిడి త్వరగా జీర్ణమవుతుంది. అయితే పాలు నెమ్మదిగా జీర్ణమవుతాయి. ఇది జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది

TV9 Telugu

అలాగే మామిడి, పెరుగును కూడా కలిపి తినడం జీర్ణ వ్యవస్థకు అంతరాయం కలిగిస్తుంది. ప్రోబయోటిక్ ఆహారమైన పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. మామిడిలో సహజ చక్కెరలు ఉంటాయి. వీటిని కలిపి తినడం వల్ల కడుపులో పులియడం పెరి గ్యాస్, ఉబ్బరానికి దారితీస్తుంది

TV9 Telugu

రాత్రిపూట వేయించిన ఆహారం తిన్న తర్వాత మామిడిపండు తినడం అంతమంచిది కాదు. మామిడి పండులో సహజ చక్కెర అధికంగా ఉంటుంది. కాబట్టి దీనిని వేయించిన ఆహారాలతో కలిపినప్పుడు, అది శరీరంలో వేడిని పెంచుతుంది. దీనివల్ల యాసిడ్ రిఫ్లక్స్ ఏర్పడతాయి

TV9 Telugu

చిక్కుడు, శనగలు, ఇతర మాంసాహారాలు తిన్న తర్వాత మామిడిపండు అస్సలు తినకూడదు. అధిక ప్రోటీన్ జీర్ణం కావడానికి సమయం పడుతుంది. అధిక ప్రోటీన్, సహజ చక్కెరల కలయిక జీర్ణాశయంపై భారాన్ని పెంచుతుంది