Madhira: ఆయా కాదు రాక్షసి.. చిన్నారి మర్మాంగంలో గోర్లతో గాట్లు పెట్టి.. పైశాచికం

చిన్నారి పదే, పదే మూత్రానికి వెళ్తుందని.. అంగన్‌వాడీ ఆయా ప్రవర్తించిన తీరు.. సభ్యసమాజం తలదించుకునేలా ఉంది.

Madhira: ఆయా కాదు రాక్షసి.. చిన్నారి మర్మాంగంలో గోర్లతో గాట్లు పెట్టి.. పైశాచికం
Baby (Representative Image)
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 16, 2022 | 1:53 PM

Telangana: చిన్న పిల్లలకు కల్మషం అనేది తెలీదు. వాళ్ల మనసు చాలా స్వచ్చంగా ఉంటుంది. అలాంటి ఏ పాపం తెలియని ఓ పసికందుపై అంగన్ వాడీ ఆయా ప్రదర్శించిన రాక్షసత్వం.. ఆమె కటువు మనసును తెలియజేస్తుంది. చిన్నారి పదే, పదే మూత్రానికి వెళ్తోందని మర్మాంగంలో గోర్లతో గాట్లు పెట్టి.. హింసించింది. పాపకు తీవ్ర గాయాలు కావడంతో.. హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ ఆయాకు కూడా బిడ్డలు ఉండే ఉంటారు కదా.. వారు చిన్నప్పుడు తెలిసీ.. తెలియక అలా చేసి ఉంటారు కదా. ఈ బుజ్జి తల్లి పట్ల అలా పైశాచికం ప్రదర్శించినప్పుడు.. తన బిడ్డలైనా గుర్తుకు రాలేదేమో..!. ఈ దారుణ ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లా(khammam district) మధిరలో వెలుగుచూసింది. అక్కడి శివాలయంలో వీధిలోని అంగన్‌వాడీ కేంద్రంలోని పనిచేస్తున్న ఆయా ప్రవర్తించిన తీరుపై స్థానికులు భగ్గుమంటున్నారు. ఆమెను ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు.. కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఈ ఘటనపై బాధిత పాప తల్లి వాపోయారు. తనకు ముగ్గురు ఆడబిడ్డలు ఉన్నారని… వారిని అంగన్​వాడీకి పంపుతున్నట్లు ఆమె తెలిపారు. పిల్లలు ఎప్పుడు మూత్ర విసర్జన‌కు వెళ్లినా.. అక్కడి ఆయా తిడుతూ కొడుతూ ఉంటుందని ఆమె ఆరోపించారు. పెద్ద పాప పట్ల ఆయా.. దారుణంగా వ్యవహరించిందని.. మర్మాంగంలో గోర్లతో గాట్లు పెట్టడం వల్ల తీవ్రగాయం అయి రక్తస్రావం అయినట్లు వివరించారు. పాప నొప్పితో విలవిల్లాడుతున్నట్టు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం