AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా.. హెలైట్స్ ఇవే

బీజేపీ మేనిఫెస్టో అమిత్ షా విడుదల చేశారు. 'మన మోదీ గ్యారంటీ.. బీజేపీ భరోసా' పేరుతో మేనిఫోస్టే రిలీజ్ చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. కాళేశ్వరం రూపంలో నిధులన్నీ కేసీఆర్‌కు చేరాయని ఆరోపించారు. ఈ 9 ఏళ్లల్లో తెలంగాణకు కేంద్రం రూ.2.15 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు.

Telangana: బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా.. హెలైట్స్ ఇవే
Amit Shah
Ram Naramaneni
|

Updated on: Nov 18, 2023 | 7:36 PM

Share

తెలంగాణ ఎన్నికల్లో భాగంగా బీజేపీ శనివారం మానిఫెస్టో విడుదల చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా  మ్యానిఫెస్టోను విడుదల చేశారు. అన్నివర్గాల ప్రజల్ని ఆకట్టుకునేలా దశదిశ పేరుతో కమలం పార్టీ మ్యానిఫెస్టోను ప్రిపేర్ చేసింది. రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే పథకాలు చక్కగా అమలవుతాయని.. ఈ మేరకు తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ గ్యారంటీ ఇస్తున్నారన్నారు అమిత్ షా. ఈ 9 ఏళ్లల్లో తెలంగాణకు కేంద్రం రూ.2.15 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. తెలంగాణకు పసుపు బోర్డు, గిరిజన వర్సిటీని మోదీ ఇప్పటికే ప్రకటించారని అమిత్ షా గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాలకు 3 వందేభారత్‌ రైళ్లు కేటాయించినట్లు తెలిపారు.

మేనిఫెస్టో హైలెట్స్ ఇప్పుడు చూద్దాం….

  • ధరణి స్థానంలో మీ భూమి యాప్‌
  • కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు నోడల్ మంత్రిత్వ శాఖ
  • పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గింపు
  • గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక నోడల్ విభాగం ఏర్పాటు
  • పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గింపు
  • బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ కుంభకోణాలపై విచారణ కమిటీ ఏర్పాటు
  • ఉద్యోగస్తులు, పింఛనర్లకు ప్రతినెల 1న వేతనాలు, పింఛన్లు
  • మత ప్రతిపాదికన ఇచ్చిన రిజర్వేషన్లను తొలగింపు
  • మత రిజర్వేషన్లు తొలగించి బీసీ, ఎస్సీలు, ఎస్టీలకు పెంపు
  • ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదా కమిటీ ఏర్పాటు
  • అర్హత కలిగిన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు
  • చిన్న, సన్నకారు రైతులకు రూ.2500 ఇన్‌పుట్‌ ఆర్థికసాయం
  • ఎరువులు, విత్తనాలు కొనుగోలు కోసం రూ.2,500 ఇన్‌పుట్ సహాయం
  • పీఎం ఫసల్‌బీమా యోజన కింద రైతులకు ఉచిత పంటల బీమా
  • ఉజ్వల పథకం దారులకు ఏడాదికి నాలుగు సిలిండర్లు
  • 6 నెలల్లో అన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
  • నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్దరణ
  • పసుపు కోసం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు
  • ఆసక్తి గల రైతులకు ఉచితంగా దేశీ ఆవులు పంపిణీ
  • అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు
  • వరికి రూ3,100 మద్దతు ధర
  • డిగ్రీ, ప్రొఫెషనల్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు
  • మహిళలకు 10 లక్షల ఉద్యోగాల కల్పన
  • అర్హతగల కుటుంబాలకు 10 లక్షల ఉచిత ఆరోగ్య బీమా
  • కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సమగ్ర సమీక్ష
  • పెండింగ్ ప్రాాజెక్టులు పూర్తి
  • వయోవృద్ధులకు ఉచితంగా ఆయోధ్య, కాశీ యాత్ర
  • ఆడబిడ్డ భరోసా పేరుతో నవజాత బాలికపై ఫిక్స్‌డ్‌ డిపాజిట్
  • బాలికకు 21 ఏళ్లు వచ్చిన తర్వాత రూ.2లక్షలు చెల్లింపు
  • స్వయం సహాయక బృందాలకు 1 శాతం వడ్డీకే రుణాలు
  • మహిళా రైతుల కోసం మహిళా రైతు కార్పొరేషన్ ఏర్పాటు
  • ఇళ్లలో పనిచేసే మహిళలకు నైపుణ్య శిక్షణ, సామాజిక భద్రత
  • ఇళ్లల్లో పనిచేసే మహిళల కోసం డొమెస్టిక్ వర్కర్స్ కార్పొరేషన్
  • నిజామాబాద్‌లో టర్మరిక్ సిటీ అభివృద్ధి
  • నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ

ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..
ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?