LS Polls: హైదరాబాద్ పార్లమెంట్ పై ప్రధాన పార్టీల ఫోకస్.. అసద్ రాజకీయ ప్రత్యర్థులు వీళ్లే

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణలోని అన్ని ప్రధాన పార్టీలు గెలుపు వ్యహాలపై తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. ఇప్పటికే ఆయా స్థానాలకు అభ్యర్థులను ఫిక్స్ చేస్తూ ఎన్నికల శంఖరావం పూరించాయి. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది హైదరాబాద్ లోక్ సభ స్థానమే.

LS Polls: హైదరాబాద్ పార్లమెంట్ పై ప్రధాన పార్టీల ఫోకస్.. అసద్ రాజకీయ ప్రత్యర్థులు వీళ్లే
Hyderabad
Follow us
Balu Jajala

|

Updated on: Mar 25, 2024 | 4:20 PM

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణలోని అన్ని ప్రధాన పార్టీలు గెలుపు వ్యహాలపై తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. ఇప్పటికే ఆయా స్థానాలకు అభ్యర్థులను ఫిక్స్ చేస్తూ ఎన్నికల శంఖరావం పూరించాయి. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది హైదరాబాద్ లోక్ సభ స్థానమే. అయితే ఆ సీటు పై ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను రంగంలోకి దింపాయి. ఈ లోక్ సభ ఎన్నికల్లో ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థులను ప్రకటించాయి.

హైదరాబాద్ లోక్ సభ స్థానానికి జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను ప్రకటించగా, హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి ఎంపీ అభ్యర్థిగా మాధవీలతను బీజేపీ ప్రకటించింది. కాగా  కాంగ్రెస్ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. అయితే 2019 ఎన్నికల్లో హైదరాబాద్ నియోజకవర్గం నుంచి అసదుద్దీన్ ఒవైసీపై 14 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఓవైసీ 58.94 శాతం ఓట్లు సాధించి విజయం సాధించారు. హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో 44.84 శాతం ఓటింగ్ తో ఒవైసీకి 26.43 శాతం ఓట్లు లభించాయి.

1989 నుంచి ఎంఐఎం వరుసగా తొమ్మిది సార్లు హైదరాబాద్ లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించింది. సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ 1984-89 మధ్య స్వతంత్ర అభ్యర్థిగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 1989 నుంచి 2004 వరకు సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ఎంఐఎం ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. అయితే 2004 నుంచి అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హైదరాబాద్ స్థానంలో విజయం సాధించేందుకు బీజేపీ ప్రయత్నాలు సాగిస్తోంది. ఇక బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కూడా ఈ స్థానంపై గురి పెట్టాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోక్ సభ సీటును ఎవరు గెలుచుకుంటారు అనేది రాజకీయంగా ఆసక్తిగా మారింది.