Hyderabad: పేదలపై కాస్త దయచూపండయ్యా.. ట్రాఫిక్ చలాన్లపై నిప్పులుకక్కిన అక్బరుద్దీన్..
ట్రాఫిక్ చలానాలపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అసెంబ్లీ వేదికగా కీలక కామెంట్స్ చేశారు. ‘ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తున్నామని పోలీసులు అనుకుంటున్నారు. కానీ, నిజానికి మరింత ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు.’ అంటూ ..

ట్రాఫిక్ చలానాలపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అసెంబ్లీ వేదికగా కీలక కామెంట్స్ చేశారు. ‘ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తున్నామని పోలీసులు అనుకుంటున్నారు. కానీ, నిజానికి మరింత ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు.’ అంటూ అసెంబ్లీ వేదికగా ట్రాఫిక్ పోలీసుల తీరుపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే. దొంగచాటుగా దాక్కుని ఫోటోలు తీసి చలాన్లు పంపుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ట్రాఫిక్ పోలీసుల కారణంగా, భారీ చలాన్లతో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సామాన్యులు ఈ చలాన్లను కట్టడానికి అవస్థలు పడుతున్నారని అన్నారు. ఓవైపు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగి సతమతం అవుతున్న ప్రజలకు.. ఈ పోలీసులు మరింత పరేషాన్ పెడుతున్నారని వ్యాఖ్యానించారు. దొంగచాటుగా దాక్కుని ఫోటోలు కొట్టి చలాన్లు పంపిస్తున్నారని, పేదోళ్లపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. హోంమంత్రి దీనిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే అక్బరుద్దీన్. హెల్మెట్, ట్రిపుల్ రైడింగ్ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని కోరుతూనే.. చిన్న చిన్న తప్పులను మన్నించండి అంటూ ప్రజల తరుఫున విజ్ఞప్తి చేశారు అక్బరుద్దీన్.
వాస్తవానికి ఒక్క హైదరాబాదే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. అయితే, హైదరాబాద్‌తో పోలిస్తే మిగతా ప్రాంతాల్లో చాలా తక్కువే అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ కంట్రోల్ చేయాలనే ఉద్దేశ్యంతో ట్రాఫిక్ పోలీసులు ప్రతి రోజూ సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. వీటిలో ముఖ్యమైనది చలాన్లు విధింపు. క్రమశిక్షణను కలిగించాలనే పేరుతో ఇష్టారీతిని చలాన్లు వేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. కుటుంబ సభ్యులతో వెళ్లినా, పక్కనే గుడి వద్దకు దేవుడి దర్శనానికి వెళ్లి వచ్చే గ్యాప్‌లోనూ చలాన్లు వేసేస్తున్నారు. అసలు ఎక్కడి నుంచి ఫోటోలు తీస్తున్నారనేది కూడా తెలియకుండానే ఫోటోలు కొట్టి.. చలాన్లను పంపిస్తున్నారు. దాంతో సామాన్యలు ఆ చలాన్లను కట్టేందుకు నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి వచ్చింది.
అక్బరుద్దీన్ ప్లెక్సీకి పాలాభిషేకం..
అసెంబ్లీలో ప్రజల సమస్యలపై పోరాడి, సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేయించిన అక్బరుద్దీన్ ఓవైసీ ఫోటోని పాలాభిషేకం చేశారు హైదరాబాద్ పాతబస్తీ ప్రజలు. ఆయన చిత్రపటానికి పాలు పోసి అభిషేకించారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..