Akbaruddin Owaisi: అక్బరుద్దీన్ విద్వేషపూరిత వ్యాఖ్యలపై తుదితీర్పు వాయిదా.. పాతబస్తీలో పోలీసుల అలర్ట్..

అక్బరుద్దీన్ విద్వేషపూరిత వ్యాఖ్యలపై తుదితీర్పు వాయిదా పడింది. విచారణను రేపటికి వాయిదా వేసింది నాంపల్లికోర్టు. 30 మంది సాక్షులను కోర్టు విచారించింది.

Akbaruddin Owaisi: అక్బరుద్దీన్ విద్వేషపూరిత వ్యాఖ్యలపై తుదితీర్పు వాయిదా.. పాతబస్తీలో పోలీసుల అలర్ట్..
Akbaruddin Owaisi
Follow us

|

Updated on: Apr 12, 2022 | 1:30 PM

అక్బరుద్దీన్(Akbaruddin Owaisi) విద్వేషపూరిత వ్యాఖ్యలపై తుదితీర్పు వాయిదా పడింది. విచారణను రేపటికి వాయిదా వేసింది నాంపల్లికోర్టు(Nampally Court). 30 మంది సాక్షులను కోర్టు విచారించింది. కోర్టుకు అక్బరుద్దీన్‌తోపాటు ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. తీర్పు వస్తుండటంతో హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. విద్వేషపూరిత వ్యాఖ్యలపై తీర్పు రేపటికి(బుధవారం)కు వాయిదా వేయడంతో మరింత టెన్షన్ పెంచుతోంది. అయితే పదేళ్ల కిందట మాట.. ఆ మాట రెండు మతాల మధ్య చిచ్చుపెట్టింది. రాజకీయ పార్టీల మధ్య వైరం పెంచింది.. కోర్టు దాకా వెళ్లింది. ధర్మపీఠం దద్దరిల్లింది. దశాబ్దం పాటు విచారణ కొనసాగింది. ఇప్పుడామాటపై న్యాయస్థానం అంతిమ తీర్పుపై దేశ వ్యాప్తంగా మరోసారి చర్చ మొదలైంది.

వేదిక- ఎంఐఎం సభ, నిర్మల్ మున్సిపల్ గ్రౌండ్స్.. అక్బరుద్దీన్ ప్రసంగం .. మీరు 100 కోట్ల మంది.. మేం కేవలం పాతిక కోట్లు మాత్రమే.. ఓ పదిహేను నిమిషాలు మాకు అప్పగించండి. ఎవరు ఎక్కువ తక్కువో చూపిస్తాం.. అంటూ అక్బరుద్దీన్ చేసిన ఈ ప్రసంగంపై ఐపీసీ 120- బీ, 153 ఏ, 295, 298, 188 సెక్షన్ల కింద పోలీసులు సుమోటోగా కేసులు పెట్టారు. ఈ కేసులో అరెస్టయిన అక్బర్ 40 రోజుల పాటు జైల్లో శిక్ష అనుభవించారు.

నిజామాబాద్ ,నిర్మల్‌ పట్టణాల్లో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఆయన్ని అరెస్ట్ చేశారు. 40 రోజుల పాటు జైలు జీవితం గడిపిన అనంతరం అక్బరుద్దీన్ బెయిల్‌పై బయటికి వచ్చారు. పదేళ్ల పాటు ఈ కేసు విచారించిన నాంపల్లి కోర్టు రేపటికి(బుధవారం) తుదితీర్పు వెలువరించనుంది. అక్బరుద్దీన్‌కి ఈ కేసులో ఎంత శిక్ష పడుతుంది? కోర్టు మన్నించి తక్కువ శిక్షతో వదిలేస్తుందా?.. లేక కఠినంగా వ్యవహరిస్తుందా? అన్నది ఉత్కంఠగా మారింది.

ఇవి కూడా చదవండి: Hyderabad: సమయం లేదు మిత్రమా.. బంపర్ ఆఫర్ మూడు రోజులే.. ఆ తర్వాత మీకు ఫుల్ బ్యాండే..

Coronovirus: కరోనా నుంచి కోలుకున్నవారిలో సంతానోత్పత్తి ఉండదా?.. స్టన్నింగ్ రిపోర్ట్..

ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..