Vedma Bhojju: సామాన్యుడిలా మారి ఆదర్శంగా నిలుస్తూ.. శభాష్ అనిపించుకుంటున్న ఆదివాసీ ఎమ్మెల్యే
నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప్రజల ఎమ్మెల్యేగా మన్ననలు పొందుతున్నారు. ప్రజా పాలనలో భాగంగా ప్రభుత్వ సంస్థలపై ప్రజలకు మరింత నమ్మకాన్ని పెంచేలా అడుగులు వేస్తూ నియోజక వర్గ ప్రజలతో శభాష్ అనిపించుకున్నాడు. నిన్న ఉట్నూర్ ఐటీడీఏ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య చికిత్స చేయించుకుని ఆదర్శ ఎమ్మెల్యేగా నిలవగా, తాజాగా మరో అడుగు ముందుకు వేసి ఆర్టీసీ బస్ లో సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణించి మా ఎమ్మెల్యే ప్రజల మనిషి అనిపించుకున్నారు.

నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప్రజల ఎమ్మెల్యేగా మన్ననలు పొందుతున్నారు. ప్రజా పాలనలో భాగంగా ప్రభుత్వ సంస్థలపై ప్రజలకు మరింత నమ్మకాన్ని పెంచేలా అడుగులు వేస్తూ నియోజక వర్గ ప్రజలతో శభాష్ అనిపించుకున్నాడు. నిన్న ఉట్నూర్ ఐటీడీఏ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య చికిత్స చేయించుకుని ఆదర్శ ఎమ్మెల్యేగా నిలవగా, తాజాగా మరో అడుగు ముందుకు వేసి ఆర్టీసీ బస్ లో సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణించి మా ఎమ్మెల్యే ప్రజల మనిషి అనిపించుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుండి ఎలాంటి అంగు ఆర్బాటాలు లేకుండా నడుచుకుంటూ ఖానాపూర్ నియోజక ప్రజల మన్ననలు అందుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఖానాపూర్ నియోజక వర్గం అనగానే అభివృద్దికి ఆమడ దూరంలో సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతూ కనిపిస్తోంది. ఈ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి బరిలోకి దిగి తొలి అవకాశంలోనే ఘన విజయాన్ని సాధించి సత్తా చాటారు ఆదివాసీ ఉద్యమ యువ నేత వెడ్మ బొజ్జు. నిరుపేద కుటుంబం నుండి ఎమ్మెల్యేగా గెలిపొందిన వెడ్మ బొజ్జు గెలిచిన తర్వాత కూడా అంతే సాదరణ జీవితాన్ని గడుపుతూ, ఆదర్శంగా నిలుస్తున్నారు. మూడు రోజుల క్రితం అస్వస్థతకు గురైన వెడ్మ బొజ్జు తీవ్ర జ్వర తో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి సామాన్యుడిలా చికిత్స తీసుకున్నారు. ఎలాంటి అంగు ఆర్బాటాలకు పోకుండా సాదరణ రోగిలా చికిత్స పొందాడు.
సామాన్య ప్రజలతో సమానంగా ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలు చేసుకోవడంతో పాటు అక్కడి వైద్య సౌకర్యాల పై ఆరా తీశారు. అనంతరం ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని వెడ్మ బొజ్జు పటేల్ వైద్యులకు సూచించారు. రోగులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజలకు మెరుగైన చికిత్సలు అందించాలన్నారు. డయాలసిస్ కోసం వచ్చే రోగులకు ప్రతిరోజు బ్లడ్ బ్యాంకు లో అన్ని రకాల రక్తం గ్రూప్ లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గర్భిణీలకు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించాలని ఎమ్మెల్యే 108 వాహనాలను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తమతో సమానంగా సామాన్యుడిలా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఎమ్మెల్యే ను చూసిన రోగులు హర్షం వ్యక్తం చేశారు.
జ్వరంతోనే ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమంలో పాల్గొన్నారు బొజ్జు. మంత్రి సీతక్క ఇంద్రవెళ్లి పర్యటనలోను జ్వరాన్ని సైతం లెక్క చేయకుండా పాల్గొన్నారు. తాజాగా ప్రజా పాలనలో భాగంగా గ్రామ సభలు.. ఆరు గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సామాన్యుడిలా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి మరోసారి ఆదర్శంగా నిలిచారు. సామాన్యులతో సమానంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు.. ప్రయాణికుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు.
ఆరు గ్యారంటీల ను ప్రయాణికులకు వివరించిన ఎమ్మెల్యే బొజ్జు.. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళ ప్రయాణికులకు ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యం పై ఆరా తీశారు. రోజు రోజు ప్రభుత్వ సంస్థల మీద బాద్యత పెంచుతూ సామాన్యుడిలా హంగు ఆర్బాటాలకు దూరంగా ఉంటూ పాలన చేస్తున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ను చూసి శభాష్ అంటున్నారు నియోజక వర్గ ప్రజలు. మూడు రోజుల మురిపంగా కాకుండా ఐదేళ్లు ఆదర్శ వంతమైన పాలన చేయాలని కోరుకుంటున్నారు నియోజకవర్గ ప్రజలు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…