Adilabad: ‘నా కొడుక్కి డెంగ్యూ, గతంలో కూతురిని కూడా కోల్పోయా.. కార్యదర్శే బాధ్యుడు’ కలెక్టర్‌కు ఓ తండ్రి ఫిర్యాదు
గతంలో డెంగ్యూ సోకి కూతురిని కోల్పోయిన ఓ తండ్రి.. తాజాగా తన ఒక్కగానొక్క కుమారుడిని కూడా డెంగ్యూ సోకడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. దీంతో గుండె బద్ధలైన కన్న ప్రేమ అధికారులపై తిరగబడేలా చేసింది. తన కుమారుడి డెంగ్యూ వచ్చి చావు అంచుల వరకూ వెళ్లి వచ్చాడని, ఇందుకు పంచాయితీ కార్యదర్శే కారణమని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. పంచాయతీ కార్యదర్శి మురుగు కాలువలు శుభ్రం..
ఆదిలాబాద్, సెప్టెంబర్ 14: గతంలో డెంగ్యూ సోకి కూతురిని కోల్పోయిన ఓ తండ్రి.. తాజాగా తన ఒక్కగానొక్క కుమారుడిని కూడా డెంగ్యూ సోకడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. దీంతో గుండె బద్ధలైన కన్న ప్రేమ అధికారులపై తిరగబడేలా చేసింది. తన కుమారుడి డెంగ్యూ వచ్చి చావు అంచుల వరకూ వెళ్లి వచ్చాడని, ఇందుకు పంచాయితీ కార్యదర్శే కారణమని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. పంచాయతీ కార్యదర్శి మురుగు కాలువలు శుభ్రం చేయించకపోవడంతో దోమలు విజృంభించి రోగాలు సోకుతున్నాయని, గతంలో తన కుమార్తె డెంగ్యూతోనే మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ గ్రామంలో మరొకరు డెంగ్యూ బారిన పడకుండా ఉండాలంటే వెంటనే , పారిశుద్ధ్య పనులు చేపట్టి సదరు కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ జిల్లాలో ఓ బాధితుడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకెళ్తే..
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం బండల్‌నాగాపూర్‌లో నివాసం ఉంటున్న పోతెమ్ నవీన్ అనే వ్యక్తి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశాడు. తన ఇంటి పరిసరాల్లో 9 నెలలుగా పారిశుద్ధ్య పనులు చేపట్టడం లేదని లేఖలో తెలిపాడు. ఇదే విషయాన్ని జూలై 7న కార్యదర్శి హమీద్ దృష్టికి తీసుకెళ్లితే.. మురుగు కాల్వలు ఆన్‌లైన్ కాలేదని సమాధానం ఇచ్చాడని అన్నాడు. సాకులు చెబుతూ గత 9 నెలలుగా తమ గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టక పోవడంతో డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయని, ఈ నెల 9న తన కొడుకు వృషీన్ డెంగ్యూ బారిన పడినట్టు పేర్కొన్నాడు. చికిత్సకు రూ.57 వేలు ఖర్చు అయిందని తెలిపాడు. గతంలో తన కూతురు వైశాలి (7) కూడా డెంగ్యూ బారీన మృతి చెందిందని వాపోయాడు. తన కొడుకు డెంగ్యూ బారిన పడటానికి కారణమైన పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు పంపిన ఆన్‌లైన్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.
యువకుడి ప్రాణం తీసిన ఆన్‌లైన్ గేమ్‌లు.. నారాయణపేటలో విషాదం
ఆన్‌లైన్ గేములు ఓ యువకుడి నిండు ప్రానాలను బలి తీసుకున్నాయి. ఆన్‌లైన్ గేముల వ్యసనాలతో ఒకసారి అప్పులపాలైతే తండ్రి తీర్చాడు. అయినా తీరు మార్చుకోని కుమారుడు మళ్లీ అదే వ్యసనంలో పడి అందినకాడికి అప్పులు చేశాడు. కానీ ఈసారి తండ్రికి ఏం చెప్పాలో తెలియక ఆత్మహత్యను ఆశ్రయించాడు. ఈ ఘటన నారాయణపేట జిల్లా కోస్గి మండలం ముక్తిపాడులో చోటుచేసుకుంది. ముక్తిపాడు గ్రామానికి చెందిన అనిల్‌కుమార్ (21) సొంతంగా ట్రాక్టర్ కొని డ్రైవరుగా జీవనం సాగించేవాడు. గతంలో ఆన్‌లైన్ గేములు ఆడి పెద్ద మొత్తంలో నష్టపోతే తండ్రి అప్పులు చెల్లించి, మళ్లీ వాటి జోలికి వెళ్లొద్దని హితవు పలికాడు. కొన్నాళ్లు బాగానే ఉన్నా..అనిల్ మళ్లీ ఆన్‌లైన్ రుణాలు తీసుకుని గేమ్‌లు ఆడటం ప్రారంభించాడు. దీంతో అప్పులు భారీగా పెరిగిపోయాయి. అతడి అకౌంట్‌లో పంట డబ్బులు, ఇతర లావాదేవీలు ఏం జరిగినా వెంటనే జమైన వెంటనే అప్పు ఇచ్చిన సంస్థలు రికవరీ చేసేవి. దీంతో తండ్రికి ఏం చెప్పాలో తెలియక శనివారం తన పొలంలోనే గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.