Vande Bharat: వందేభారత్‌కు జై కొడుతోన్న వారిలో వారే అధికం.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన..
ఇక తెలుగు రాష్ట్రాల మధ్య కూడా వందే భారత్ రైళ్లకు మంది ఆదరణ లభిస్తోంది. ధర ఎక్కువైనా త్వరగా గమ్యాన్ని చేరుకోవచ్చనే కారణంగా ఈ రైళ్లకు జైకొడుతున్నారు. ఇదిలా ఉంటే వందే భారత్‌కు ఎవరు జై కొడుతున్నారన్న విషయంపై దక్షిణ మధ్య రైల్వే పలు కీలక విషయాలను పంచుకుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లున అధికంగా ఉపయోగిస్తున్న వారిలో యువతే ఎక్కువని అధికారులు చెబుతున్నారు...
భారతీయు రైల్వే ముఖచిత్రాన్ని వందే భారత్ రైళ్లు మార్చాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. హైస్పీడ్‌తో పాటు అత్యాధునిక సదుపాయాలతో కూడిన ప్రయాణం చేయాలనుకునే వారికి మంచి అవకాశంలా వందే భారత్ దొరికింది. దీంతో ఈ రైళ్లు అందుబాటులోకి రావడంతో ప్రజలు సైతం పెద్దఎత్తున మొగ్గు చూపారు. దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల మధ్య ప్రస్తుతం వందే భారత్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి.
ఇక తెలుగు రాష్ట్రాల మధ్య కూడా వందే భారత్ రైళ్లకు మంది ఆదరణ లభిస్తోంది. ధర ఎక్కువైనా త్వరగా గమ్యాన్ని చేరుకోవచ్చనే కారణంగా ఈ రైళ్లకు జైకొడుతున్నారు. ఇదిలా ఉంటే వందే భారత్‌కు ఎవరు జై కొడుతున్నారన్న విషయంపై దక్షిణ మధ్య రైల్వే పలు కీలక విషయాలను పంచుకుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లున అధికంగా ఉపయోగిస్తున్న వారిలో యువతే ఎక్కువని అధికారులు చెబుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న వందే భారత్ రైళ్లలో ఏకంగా 56 శాతం మంది యువకులు ప్రయాణిస్తున్నట్లు తేలింది.
వేగంగా గమ్యాన్ని చేరుకోవడం, అత్యాధునిక సదుపాయాలు ఉండడంతో యువత ఈ రైళ్లకు జై కొడుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో మొత్తం 5 వందే భారత్ రైళ్లు నడిపిస్తున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-విశాఖపట్నం, కాచిగూడ-యశ్వంత్ పూర్ (హైదరాబాద్-బెంగళూరు), విజయవాడ-చెన్నై రూట్స్‌లో వందే భారత్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి. అధికారులు చేపట్టిన అధ్యయనంలో తేలిన వివరాల ప్రకారం.. సగటున 29.08 శాతం మంది ప్రయాణికులు 25-34 ఏళ్ల మధ్య ఉన్నావరే కావడం విశేషం.
ఇక తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న వందే భారత్‌లో పలు సర్వీసులు 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక వందే భారత్ రైళ్లలో ప్రయాణిస్తున్న వారిలో సగటున 56 శాతం మంది యువకులు కావడం విశేషం, ఇక తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్‌లో ప్రయాణిస్తున్న వారిలో యువత తర్వాత ఎక్కువ మంది 60 ఏళ్లు దాటిన వారే ఉన్నారు. మొత్తం ప్రయాణికుల్లో 11.81 శాతం మంది 60 ఏళ్లకు పైబడిన వారు వీటిలో ప్రయాణిస్తున్నారు. ఇదిలా ఉంటే వందే భారత్ రైళ్లు ప్రారంభించిన తర్వాత ఇప్పటి వరకు మొత్తం 7.16 లక్షల మంది ప్రయాణికులు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..