Amit Shah: జాతీయ నేతల వరుస పర్యటనలు.. అక్టోబర్ 26న రాష్ట్రానికి అమిత్ షా.. ఎవరెవరితో భేటీ అవుతున్నారంటే..?
బీజేపీలో జరుగుతున్న రెండో యాక్టివిటీ అభ్యర్థుల జాబితాపై కసరత్తు, అసంతృప్తుల బుజ్జగింపులు. తొలి జాబితా తర్వాత రోజురోజుకీ పెరుగుతున్న అసంతృప్తుల లిస్ట్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అసంతృప్త నేతలతో విడివిడిగా భేటీ కాబోతున్నారు అమిత్ షా. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో సభ పెట్టడంతో ప్రతిపక్ష పార్టీల్లో టెన్షన్ మొదలైంది.

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ వ్యూహాలకు పదునుపెడుతోంది. స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత.. తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు ఒక్కొక్కరిగా క్యూ కడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. అక్టోబర్ 27న అమిత్‌షా రాష్ట్రానికి రానున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. అమిత్ షా తర్వాత షెడ్యూల్ తర్వాత జేపీ నడ్డా కూడా పర్యటించనున్నారు.
ఓవైపు అభ్యర్థుల కసరత్తు, మరోవైపు హోరెత్తే ప్రచారాలతో ఈ సారి తెలంగాణ ఎన్నికలు మునుపటి లేని విధంగా ఉండబోతున్నాయన్నదీ సుస్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నేతలు రాష్ట్రాన్ని చుట్టేయబోతున్నారు. తెలంగాణ ఎన్నికల మహా సంగ్రామాన్ని మరింత రసవత్తరంగా మార్చేందుకు జాతీయస్థాయి నేతలు రంగంలోకి దిగుతున్నారు. భారీ ఎత్తున ప్రచారాలకు సిద్ధమవుతున్నాయి అన్ని పార్టీలు. ఇప్పటికే బీజేపీ నుంచి ప్రధాని మోదీ తొలి దఫా ప్రచారం శ్రీకారం చుట్టారు. అటు కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బస్సు యాత్ర ప్రారంభించారు. తాజా కేంద్ర హోంమత్రి అమిత్ షా తెలంగాణ రాబోతుండటంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నవంబర్ 20లోపు మొత్తం 15కి పైగా సభల్లో ఇద్దరు బీజేపీ అగ్ర నేతలు మోదీ, అమిత్ షా పాల్గొనబోతున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అందులో ఒక్క మోదీనే ఐదు నుంచి 10సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ ఫిక్స్ చేస్తున్నారు. అగ్రనేతల సభల్లో ప్రకటన కోసం మేనిఫెస్టోపైనా కసరత్తు చేస్తోంది బీజేపీ.
ఈ నేపథ్యంలోనే హోంమంత్రి అమిత్ షా అక్టోబర్ 26 గురువారం రాత్రి హైదరాబాద్‌కు రానున్నారు. అక్టోబర్ 27న నేషనల్ పోలీస్ అకాడమీలో జరిగే ఐపీఎస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొంటారు. అదే రోజు మధ్యాహ్నం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించే బీజేపీ ఎన్నికల ప్రచార సభకు హాజరవుతారు. నూతన వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారని బీజేపీ నేతలు తెలిపారు. ఇక హైదరాబాద్ పర్యటనలో భాగంగా పార్టీ ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ కానున్నారు. ఎన్నికల కార్యాచరణ, ప్రచార సరళిపై ప్రధానంగా స్థానిక నేతలతో చర్చిస్తారు అమిత్ షా.
ఇక టూర్ల వ్యవహారం పక్కన పెడితే బీజేపీలో జరుగుతున్న రెండో యాక్టివిటీ అభ్యర్థుల జాబితాపై కసరత్తు, అసంతృప్తుల బుజ్జగింపులు. తొలి జాబితా తర్వాత రోజురోజుకీ పెరుగుతున్న అసంతృప్తుల లిస్ట్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అసంతృప్త నేతలతో విడివిడిగా భేటీ కాబోతున్నారు అమిత్ షా. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో సభ పెట్టడంతో ప్రతిపక్ష పార్టీల్లో టెన్షన్ మొదలైంది. రాజగోపాల్‌రెడ్డి.. బీజేపీలో ఉంటారో లేదోనన్న ఆందోళన కనిపిస్తోంది.
మరోవైపు అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నవంబరు ఒకటో తేదీ ఆ తర్వాతే మిగిలిన అభ్యర్థుల ప్రకటన ఉంటుందని సమాచారం. నవంబరు 1వ తేదీన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. అదే రోజు లేదా నవంబరు 2న రెండో జాబితాను ప్రకటిస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకుగాను బీజేపీ ఇప్పటికే 52 నియోజకవర్గాలకు అభ్యర్థులను పార్టీ ప్రకటించింది. మిగిలిన వాటిలో అత్యధిక స్థానాల అభ్యర్థులపై రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల రెండో జాబితాపై కసరత్తు కొనసాగుతోంది. దీనిపై కేంద్ర నాయకత్వంతో బీజేపీ నేతలు చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, డాక్టర్ కె.లక్ష్మణ్ నేడు ఢిల్లీకి వెళ్తున్నారని సమాచారం. అదే సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్తారని తెలుస్తోంది. బీజేపీ అగ్రనేతలతో వీరంతా చర్చలు జరిపి పొత్తులపై ఒక అంగీకారానికి వచ్చే అవకాశముంది. ఇదే సమావేశంలో జీహెచ్‌ఎంసీ పరిధి సహా పలు స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థులపై స్పష్టత వస్తుందని సమాచారం. జనసేన ఇప్పటికే 32 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. రెండు పార్టీలు కలసి పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని బీజేపీ నేతలు ఇప్పటికే వ్యక్తపరిచారు. కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ ఇటీవల పవన్‌కల్యాణ్‌ను కలసి ఉమ్మడిగా పోటీ చేసే అంశంపై చర్చించారు.
తెలంగాణ ఎన్నికల కోసం 52మందితో తొలి జాబితా విడుదల చేసింది బీజేపీ హైకమాండ్. కానీ విడుదలైన మర్నాడు నుంచే అసంతృప్తులు మొదలయ్యాయి. అలకలు, కన్నీళ్లు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఈ అసంతృప్తి జ్వాలపై స్వయంగా జాతీయ నాయకత్వమే ఫోకస్ పెట్టబోతున్నట్లు సమాచారం. అమిత్ షా వచ్చి వెళ్లాక తెలంగాణ పర్యటనకు సిద్ధంగా ఉన్నారు జేపీ నడ్డా. వీళ్లిద్దరి సారథ్యంలోనే తెలంగాణలో మొత్తం 15కిపైగా సభలు ఉండబోతున్నాయి. ప్రధాని మోదీ కూడా ఐదు నుంచి పది సభల్లో పాల్గొనే చాన్స్ ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
