Hyderabad: ఫ్రెండ్షిప్ మధ్య చిచ్చు పెట్టిన ప్రేమ.. ప్రేమించిన యువతి కోసం స్నేహితుడినే చంపేశాడు.. కట్ చేస్తే..
ఇద్దరుూ బెస్ట్ ఫ్రెండ్స్. ప్రేమించింది ఒకే అమ్మాయిని. ఆ ఫ్రెండ్ షిప్ పోకుండా ఒకరికి తెలియకుండా మరొకరు ఇద్దరూ అమ్మాయిని త్యాగం చేస్తారు. ఇదీ అప్పట్లో కుర్రకారును ఊపేసిన ప్రేమదేశం సినిమా. కానీ రియల్ లైఫ్‌లో..
ఇద్దరుూ బెస్ట్ ఫ్రెండ్స్. ప్రేమించింది ఒకే అమ్మాయిని. ఆ ఫ్రెండ్ షిప్ పోకుండా ఒకరికి తెలియకుండా మరొకరు ఇద్దరూ అమ్మాయిని త్యాగం చేస్తారు. ఇదీ అప్పట్లో కుర్రకారును ఊపేసిన ప్రేమదేశం సినిమా. కానీ రియల్ లైఫ్‌లో మాత్రం ప్రేమదేశంలో విలన్‌గా మారాడో ఫ్రెండ్. ఈ బ్రేకింగ్ హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ నుంచి వస్తోంది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఇద్దరు ఫ్రెండ్స్ పేర్లు హరి, నవీన్. వీళ్లిద్దరూ నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్శిటీలో ఇంజినీరింగ్ చదువుతున్నారు. వీళ్లతో పాటే కలిసి చదువుతున్న ఓ అమ్మాయినే ఇద్దరూ ప్రేమించారు. ఆ అమ్మాయి నవీన్‌కి దగ్గరుతోందని భావించిన హరి.. అతన్ని చంపేశాడు. ఈ నెల 17న పార్టీ చేసుకుందాం రమ్మని పిలిచాడు. ఇద్దరూ మద్యం సేవించారు. అప్పుడు వచ్చిన ప్రేమ టాపిక్‌లో మాటామాటా పెరిగింది. అంతే నవీన్‌ను చంపేశాడు హరి. అంతే ఆ తర్వాత పరారయ్యాడు.
తాను ప్రేమించిన అమ్మాయి ఎక్కడ తన స్నేహితుడికి దక్కుతుందోనన్న అనుమానంతో పార్టీ పేరుతో పిలిచి దారుణంగా కొట్టి చంపాడు. నాగర్‌కర్నూల్ జిల్లా చారుకొండ మండలం సిరిసనగండ్లకు చెందిన నేనావత్ నవీన్.. ఎంజీ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. ఈ నెల 17న ఉదయం పార్టీ చేసుకుందామని హైదరాబాద్ అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసు స్టేషన్ పరిధిలోని తన స్నేహితుడి రూమ్‌కు నేనావత్ నవీన్‌ను హరి ఆహ్వానించాడు. పార్టీలో ఇద్దరికీ గొడవ జరిగింది. నవీన్ తండ్రి శంకరయ్య హరితో మాట్లాడడంతో గొడవ సద్దుమణిగింది. నాలుగు రోజులైనా కళాశాలకు, ఇంటికి నవీన్ రాకపోవడంతో ఈ నెల 22న అతని తండ్రి శంకరయ్య నార్కట్‌పల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ నెల 22న సాయంత్రం నుంచి హరి ఫోన్ స్విఛ్చాఫ్ రావడంతో వారి తల్లిదండ్రులను పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో హరి శుక్రవారం రాత్రి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. తన ప్రియురాలిని ఎక్కడ దక్కించుకుంటాడనే అసూయతోనే విచక్షణారహితంగా కొట్టి హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..