AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

60 ఏళ్ల వృద్ధురాలి మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు.. ఎవరో తెలిసి షాక్!

హైదరాబాద్ శివారు నార్సింగ్‌‌లో అదృశ్యమైన వృద్ధురాలు.. వికారాబాద్‌ అడవుల్లో శవమై తేలింది. వాకింగ్‌‌కు వెళ్లిన వృద్ధ మహిళ కనిపించకుండాపోయి.. వారం తర్వాత కుళ్లిపోయిన స్థితిలో శవంగా లభ్యమైంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక్కడ నార్సింగ్‌లో మిస్సై.. 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవుల్లో ఎలా చనిపోయింది. అంత కిరాతకంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది..?

60 ఏళ్ల వృద్ధురాలి మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు.. ఎవరో తెలిసి షాక్!
Old Woman For Jewelry
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Jun 10, 2025 | 4:21 PM

Share

హైదరాబాద్ శివారు నార్సింగ్‌‌లో అదృశ్యమైన వృద్ధురాలు.. వికారాబాద్‌ అడవుల్లో శవమై తేలింది. వాకింగ్‌‌కు వెళ్లిన వృద్ధ మహిళ కనిపించకుండాపోయి.. వారం తర్వాత కుళ్లిపోయిన స్థితిలో శవంగా లభ్యమైంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక్కడ నార్సింగ్‌లో మిస్సై.. 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవుల్లో ఎలా చనిపోయింది. అంత కిరాతకంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది..? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టగా, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

నార్సింగ్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్‌కి చెందిన వృద్ధురాలు బాలమ్మ.. జూేన్ 3వ తేదీన తెల్లవారుజామున వాకింగ్‌‌కు వెళ్లింది. ఎంతసేపైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో.. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు అటు ఇటుగా వెతికి, చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో ఓ ఇంట్రస్టింగ్‌ పాయింట్‌ జత చేసింది బాలమ్మ కోడలు. రెగ్యులర్‌ గా ఓ మహిళతో వాకింగ్‌ కి వెళ్తుంటుందని.. ఆ మహిళ కూడా కనిపించడం లేదని, ఫోన్‌ చేసినా స్విచ్చాఫ్‌ వస్తోందని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో అనుమానం మరింత బలపడింది.

సదరు మహిళ మొబైల్‌ నెంబర్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు నార్సింగ్‌ పోలీసులు. ఆ మహిళ వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం మిట్టకోడూరుకు చెందిన అనితగా గుర్తించారు పోలీసులు. అనితను అదుపులోకి తీసుకుని విచారించారు. తొలుత తనకేం తెలియదని బుకాయించినా.. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా, అసలు విషయం బయటపడింది. బాలమ్మను తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది అనిత. బాలమ్మ ఒంటి మీద ఉన్న బంగారం, వెండి నగల కోసమే హత్య చేసినట్లు ఒప్పుకుంది. మృతదేహాన్ని కండ్లపల్లి అటవీ ప్రాంతంలో పారేసినట్లు చెప్పడంతో.. పోలీసులు కండ్లపల్లిలో వెతికారు.

అనిత చూపించిన స్పాట్‌లో ఎలాంటి మృతదేహం లభించలేదు. దీంతో నార్సింగ్‌ పోలీసులు పరిగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పుడే మరో షాకింగ్‌ ఇన్సిడెంట్‌ వెలుగులోకి వచ్చింది. జూన్ 4వ తేదీన ఆ ప్రాంతంలో గుర్తుతెలియని ఓ వృద్దురాలి మృతదేహం లభ్యమైందని, తమ పరిధిలో ఎలాంటి మిస్సింగ్‌ కేసు లేదు. మృతురాలి ఒంటిమీద ఎలాంటి గాయాలు కూడా లేకపోవడంతో.. అనుమానాస్పద స్థితిలో మృతి కింది కేసు నమోదు చేశామని పరిగి పోలీసులు తెలిపారు. అక్కడే పోస్ట్‌మార్టం నిర్వహించి, అదే ప్రాంతంలో ఖననం చేశామన్నారు.

దీంతో నార్సింగ్‌ పోలీసులు మృదేమాన్ని వెలికితీశారు. బాలమ్మ కుటుంబసభ్యులు.. అది బాలమ్మ మృతదేహంగా గుర్తించారు. మరోసారి పోస్ట్‌మార్టం నిర్వహించి, మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు నార్సింగ్‌ పోలీసులు. అనితను అదుపులోకి తీసుకున్న నార్సింగ్‌ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అనితకు ఎవరు సహకరించారు, ఎలా హత్య చేసింది..? నార్సింగ్‌లో వాకింగ్‌ చేస్తున్న మహిళను అంతదూరం ఎలా తీసుకొచ్చింది..? అనే విచారణ కొనసాగుతోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..