Siddipet: నాన్నే దైవం.. లేని నాన్నను ప్రతి రోజూ చూడాలని, కుమారుడు ఏం చేశాడో చూడండి..
సిద్ధిపేట, జులై 20: తల్లిదండ్రులు బతికి ఉన్నప్పుడే సరిగ్గా చూడని పిల్లలు ఉన్న ఈ రోజుల్లో.. వారు చనిపోయిన తరవాత కూడా వాళ్లను గుర్తు పెట్టుకునే వాళ్లు చాలా తక్కువ..అలాంటిది తండ్రి చనిపోయిన కూడా అతని విగ్రహాన్ని పెట్టుకొని పూజలు చేస్తున్నాడు ఓ కొడుకు.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి తన...

సిద్ధిపేట, జులై 20: తల్లిదండ్రులు బతికి ఉన్నప్పుడే సరిగ్గా చూడని పిల్లలు ఉన్న ఈ రోజుల్లో.. వారు చనిపోయిన తరవాత కూడా వాళ్లను గుర్తు పెట్టుకునే వాళ్లు చాలా తక్కువ..అలాంటిది తండ్రి చనిపోయిన కూడా అతని విగ్రహాన్ని పెట్టుకొని పూజలు చేస్తున్నాడు ఓ కొడుకు.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి తన తండ్రి మరణించిన, ఆయన రూపాన్ని ప్రతిరోజు చూడాలనే కోరికతో తన తండ్రి విగ్రహాన్ని ఏకంగా తన ఇంటి ఎదుటే నిర్మించుకున్నాడు.
ప్రతిరోజు తండ్రి కోమరయ్య రూపాన్ని విగ్రహంలో చూస్తూ సంతోష పడుతున్నాడు. ఇతని తండ్రి తాడూరి కొమురయ్య మూడు సంవత్సరాల క్రితం మరణించారు. కొమురయ్య ఒక్కగానొక్క కుమారుడు లక్ష్మణ్. తండ్రి కొమురయ్య మరణించిన ఆయన జ్ఞాపకాలు, రూపం ఎప్పుడు తన కళ్లెదుటే ఉండాలనే ఉద్దేశంతో కుమారుడు లక్ష్మణ్ తండ్రి కొమురయ్య విగ్రహాన్ని ప్రత్యేకంగా చేయించుకోని తన ఇంటి ఎదుట ప్రతిష్టించు కున్నాడు. ప్రతిరోజు తన తండ్రి విగ్రహంకు పూజ చేసి మొక్కిన తర్వాతే ఏ పని అయిన మొదలు పెడతాడు లక్ష్మణ్.

తల్లిదండ్రులను బతికున్నప్పుడే పట్టించుకోని నేటి రోజుల్లో చనిపోయిన తండ్రి విగ్రహాన్ని ఏకంగా తన ఇంటి ఎదుట ఏర్పాటు చేయించుకోని, తండ్రిపై పై తనకు ప్రేమను ఇలా చాటుకుంటున్న లక్ష్మణ్ ఎంతోమందికి ఆదర్శనీయంగా నిలుస్తున్నాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
