AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వైద్యురాలు లేకపోవండతో బాలింతకు కాన్పు చేసిన నర్సు.. చివరికి ఏం జరిగిందంటే ?

ఈ మధ్య బాలింతలకు కాన్పులు వికటించి తల్లి లేదా బిడ్డ మృతి చెందితున్న సందర్భాలు అక్కడక్కడ చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా సరైన వైద్యం అందకపోవడం లేక డాక్టర్లకు బదులు నర్సులు వైద్యం చేయడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా అలాంటి ఘటనే మళ్లీ ఇప్పుడు రిపీట్ అయ్యింది. జనగామ జిల్లా పాలకుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఓ శిశువు మరణించిడం కలకలం రేపింది.

Telangana: వైద్యురాలు లేకపోవండతో బాలింతకు కాన్పు చేసిన నర్సు.. చివరికి ఏం జరిగిందంటే ?
Baby
Aravind B
|

Updated on: Aug 25, 2023 | 6:43 AM

Share

ఈ మధ్య బాలింతలకు కాన్పులు వికటించి తల్లి లేదా బిడ్డ మృతి చెందితున్న సందర్భాలు అక్కడక్కడ చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా సరైన వైద్యం అందకపోవడం లేక డాక్టర్లకు బదులు నర్సులు వైద్యం చేయడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా అలాంటి ఘటనే మళ్లీ ఇప్పుడు రిపీట్ అయ్యింది. జనగామ జిల్లా పాలకుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఓ శిశువు మరణించిడం కలకలం రేపింది. వైద్యురాలికి బదులు అందులో పనిచేసే నర్సు సిజేరియన్ కాన్పు చేయడంతో ఆ బిడ్డ మృతి చెందింది. బాధితులు ఆందోళన చేయడంతో గురువారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామానికి చెందిన కన్నెబోయిన స్రవంతికి బుధవారం రోజు పురిటినొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను పాలకర్తిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అయితే అక్కడ వైద్యులు సాధారణ కాన్పు చేస్తామని చెప్పారు. దీంతో ఆ బాలింత కుటుంబ సభ్యులు అక్కడే ఉండిపోయారు. అయితే అర్థరాత్రికి అకస్మాత్తుగా ఆమెకు పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. ఆ సమయంలో విధుల్లో ఉండాల్సినటువంటి వైద్యురాలు స్పప్న అందుబాటులో లేదు. దీంతో స్టాఫ్ నర్సు సరిత మాత్రమే ఉంది. ఇక చేసేదేమి లేక ఆ నర్సు.. సిబ్బంది సహకారంతో శస్త్రచికిత్సతో కాన్పు చేశారు. ఆ బాలింత ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆ బిడ్డలో చలనం కనిపించలేదు. దీంతో వెంటనే జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ శిశువు మృతి చెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే బిడ్డ మృతి చెందిందంటూ గురువారం రోజున శిశువు కుటుంబ సభ్యులు పాలకుర్తిలోని ఆసుపత్రి ఎదుట ప్రజా సంఘాలతో కలిసి నిరసన చేశారు.

వైద్యురాలు, స్టాఫ్ నర్సులను విధుల వెంటనే తొలగించాలంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత ఆసుపత్రి సూపరింటెండెంట్‌ లింగమూర్తి, వైద్య విధాన పరిషత్‌ పర్యవేక్షకుడు సుగుణకర్‌రాజు బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. శిశువు తండ్రి ఇచ్చిన ఫిర్యాదును వారు తీసుకున్నారు. వైద్యురాలు, స్వప్న, స్టాఫ్ నర్సు సరితపై చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. దీంతో బాధితులు తమ ఆందోళనను విరమించారు. మరో విషయం ఏంటంటే అసలు వైద్యురాలు స్వప్న సెలవు పెట్టకుండానే విధులకు గైర్హాజరైనట్టు సమాచారం. మరోవైపు ఇలాంటి ఘటనలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఎక్కువగా జరగడం కలకలం రేపుతోంది. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వైద్యులు ఎల్లప్పుడు ఆసుపత్రిలో అందుబాటులో ఉండేలా చూడాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
డైనింగ్‌ టేబుల్‌ పక్కన పెట్టి.. నేల మీద కూర్చుని తినండి.. లాభాలు
డైనింగ్‌ టేబుల్‌ పక్కన పెట్టి.. నేల మీద కూర్చుని తినండి.. లాభాలు
డబ్బు కోసం ఇంత దారుణమా.. ? రష్మీ ఎమోషనల్ పోస్ట్..
డబ్బు కోసం ఇంత దారుణమా.. ? రష్మీ ఎమోషనల్ పోస్ట్..
నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..
నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..
ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..
వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..