Telangana: ఆకలితో టిఫిన్ సెంటర్‌కు వెళ్ళి ఇడ్లీ అర్డర్ చేసిన వ్యక్తి.. ఫ్లేట్‌లో వచ్చింది చూసి షాక్..!
ఆకలితో.. టిఫిన్ చేద్దామని హోటల్‌లో అడుగు పెట్టారు. ఇడ్లీ త్వరగా వస్తుందని ఆర్డర్ ఇచ్చారు. వెంటనే.. ఇడ్లీ టేబుల్ పైకి వచ్చింది.. కానీ.. ఇడ్లీలో ఏదో వింత ఆకారం దర్శనమిచ్చింది.
ఆకలితో.. టిఫిన్ చేద్దామని హోటల్‌లో అడుగు పెట్టారు. ఇడ్లీ త్వరగా వస్తుందని ఆర్డర్ ఇచ్చారు. వెంటనే.. ఇడ్లీ టేబుల్ పైకి వచ్చింది.. కానీ.. ఇడ్లీలో ఏదో వింత ఆకారం దర్శనమిచ్చింది. ఇదేంటని హోటల్ యజమానిని నిలదీస్తే.. నిర్లక్ష్యం సమాధానం వచ్చింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కటై, సదరు హోటల్ ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
జగిత్యాల జిల్లా కేంద్రం లో ప్రముఖ గణేష్ భవన్ ఉడిపి హోటల్‌లో ఓ కస్టమర్ ఇడ్లీని అర్డర్ చేశాడు. తన పిల్లలకు ఇడ్లీ తినిపించే సమయంలో అందులో జెర్రీ కనబడింది. జెర్రీని చూసి భయపడ్డారు. పిల్లలకు ఇడ్లీ తినిపించే క్రమంలో జెర్రీ ప్రత్యక్షం కావడంతో హోటల్ ఓనర్‌ను సదరు కస్టమర్ నిలదీశాడు. అయితే అదే సమయంలో అది జెర్రీ కాదంటూ హోటల్ యాజమాని నోట్లో వేసుకున్నాడు. చివరికి అది జెర్రీ అని తేలడంతో ఉమ్మేశాడు ఓనర్. ఆ తరువాత.. అసలు విషయాన్నీ ఒప్పుకున్నారు.
వెంటనే ఇడ్లీలను పారవేసి, మున్సిపల్ వాహంలో అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు హోటల్ నిర్వాహకులు. దీన్ని అడ్డుకుని ఇడ్లీలతో రోడ్డుపై బైఠాయించాడు బాధితుడు. సదరు హోటల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయం క్షణాల్లో పట్టణమంతా పాకడంతో అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. హోటల్ యాజమాన్యంపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా కస్టమర్‌పై దురుసు గా ప్రవర్తించిన హోటల్ యజమానిని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇటీవల హోటల్లో నాణ్యమైన ఆహారం లభించడం లేదు. నాసిరకం ఫుడ్‌ను అందిస్తున్నారు. ఫుడ్ బాగా లేదని కస్టమర్ అడుగుతే.. వారిపైన దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు తరుచు జరగడంతో హోటల్స్‌లో తినాలంటే.. భయపడే పరిస్థితి నెలకొంది. ఇలాంటి హోటల్స్‌పై కఠిన చర్యలు తీసుకొని.. మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలనే స్థానికులు కోరుతున్నారు. కాగా, ఈ సంఘటనకు సంబంధించి సమాచారం అందుున్న అధికారులు ఆరా తీస్తున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..