AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‌లో ఫైర్ యాక్సిడెంట్.. బిర్యానీ వదిలి జనం పరుగులు!

. ఇష్టమైన బిర్యానీని తినే టైమ్‌కు ఒక్కసారిగా ప్యారడైజ్ హోటల్ భవనానికి మంటలు అంటుకున్నాయి. సెల్లార్‌లోని జనరేటర్ నుంచి వచ్చిన మంటలు క్షణాల్లో ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి.

సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‌లో ఫైర్ యాక్సిడెంట్.. బిర్యానీ వదిలి జనం పరుగులు!
Paradise Hotel Fire Accident
Noor Mohammed Shaik
| Edited By: Balaraju Goud|

Updated on: Aug 23, 2024 | 4:44 PM

Share

ఘుమఘుమలాడే నోరూరించే ప్యారడైజ్ బిర్యానీ ఆరగించాలని వెళ్లారు భోజన ప్రియులు. సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్ కెళ్ళి బిర్యానీ కోసం ఆర్డరిచ్చారు. టేబుళ్లపైకి వేడి వేడి బిర్యానీని సర్వర్లు తెచ్చి ప్లేట్లల్లో వడ్డించారు. లొట్టలేసుకుని బిర్యానీ తిందామని భావించిన వారికి ఆశలన్నీ ఆడియాశలయ్యాయి. ఇంతకీ అక్కడ ఏం జరిగింది.

మిట్ట మధ్యాహ్నం వేళ.. కడుపులో నకనకలాడే కస్టమర్లు రుచికరమైన బిర్యానీని కడుపారా ఆరగిద్దామని భావించారు. బిల్లు చెల్లించి బిర్యానీ కోసం ఎదురు చూడసాగారు. కాసేపటికి వేడి వేడి బిర్యానీని సర్వర్లు తెచ్చి ప్లేట్లల్లో వడ్డించారు. ఇష్టమైన బిర్యానీని తినే టైమ్‌కు ఒక్కసారిగా ప్యారడైజ్ హోటల్ భవనానికి మంటలు అంటుకున్నాయి. సెల్లార్‌లోని జనరేటర్ నుంచి వచ్చిన మంటలు క్షణాల్లో ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. బిర్యానీ భోజనాలు వదిలి ఇంతలో ఎటు వాళ్ళు అటు పరుగెత్తారు.

వీడియో చూడండి…

ప్యారడైజ్ హోటల్‌​లోని సెల్లార్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జనరేటర్ నుంచి అంటుకున్న మంటలు బిల్డింగ్ మొత్తం పొగలు కమ్ముకున్నాయి. వెంటనే అప్రమత్తమైన హోటల్ సిబ్బంది అగ్నిమాపక అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. హోటల్లో భోజనం చేస్తున్న వారిని బయటకు పంపి ప్రాణం నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నారు. సెల్లార్ నుండి పెద్ద ఎత్తున పొగలు దట్టంగా రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, వరుసగా సికింద్రాబాద్ ప్రాంతంలో అగ్నిప్రమాదాలు జరుగుతుండటం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..