75th independence day: దేశానికే ఆదర్శంగా తెలంగాణ.. గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

CM KCR Hoists the National Flag: తెలంగాణలోని హైదరాబాద్ గోల్కొండ కోటలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

75th independence day: దేశానికే ఆదర్శంగా తెలంగాణ.. గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
Kcr
Follow us

|

Updated on: Aug 15, 2021 | 11:17 AM

CM KCR Hoists the National Flag: తెలంగాణలోని హైదరాబాద్ గోల్కొండ కోటలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా వందనం అనంతరం సాయుధ దళాల నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. స్వరాష్ట్రం సాధించుకున్న నాటినుంచి అన్ని రంగాల అభివృద్ధిపై దృష్టి సారించామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. విద్యుత్, తాగునీటి, సాగునీటి సమస్యలు తెలంగాణలో లేవని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఈ రంగాల్లో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల వారు తెలంగాణను ఆదర్శంగా తీసుకుని, ఇక్కడి విధానాలను అవలంభిస్తున్నారని కేసీఆర్ పేర్కొన్నారు.

దేశం సాధించిన ప్రగతిని సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశంలో ఇంకా అసమానతలు నెలకొన్నాయని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణలో రేపటినుంచి అన్నదాతలకు రుణమాఫీ అమలు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 3 లక్షలమందికి రుణమాఫీ అమలు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రూ.25లోపు రుణాలను ఇప్పటికే మాఫీ చేసినట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

ఏడేళ్లల్లో తెలంగాణ స్థిరమైన ఆర్థికాభివృద్దితో నెంబర్‌వన్ గా నిలిచిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దండగ అనుకున్న వ్యవసాయం.. పండుగలా మారిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత.. వ్యవసాయంలో రాష్ట్రం గణనీయంగా అభివృద్ధి సాధించిందని కేసీఆర్ పేర్కొన్నారు. దేశ తలసరి ఆదాయం కంటే.. తెలంగాణ తలసరి ఆదాయం రెట్టింపు అయిందని సీఎం కేసఆర్ పేర్కొ్నారు. కరోనా ఆటంకంగా మారినా రాష్ట్రంలో అభివృద్ధి ఆగలేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

నల్లగొండలోని యాదాద్రి పవర్ ప్లాంట్ త్వరలోనే పూర్తవుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తే తెలంగాణ మిగులు విద్యుత్ ఉంటుందని సీఎం పేర్కొన్నారు. దేశం ఎన్నో రంగాల్లో అభివృద్ది సాధించిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ రోజున స్వాతంత్ర్య పోరాట ఉజ్వల ఘట్టాలను స్మరించుకోవాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

Also Read:

Independence Day 2021: భారత్‌ ప్రబలశక్తిగా ఎదగాలనే సంకల్పం తీసుకుందాం.. ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని మోదీ

Independence Day 2021: జాతీయ జెండా గురించి మీకు ఈ విషయాలు తెలుసా?.. తెలియకపోతే ఖచ్చితంగా తెలుసుకోండి..