AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: విద్యుత్ ఉద్యోగులకు శుభవార్త..7 శాతం ఫిట్‌మెంట్‌తో పాటు..

విద్యుత్తు ఉద్యోగులకు 7 శాతం ఫిట్‌మెంట్‌ పెంపుతో కొత్త వేతన సవరణ ఒప్పందం కుదిరింది. శనివారం సాయంత్రం విద్యుత్‌సౌధ సమావేశ మందిరంలో ఉద్యోగ సంఘాల ఐక్యకార్యాచరణ సమితి ఛైర్మన్‌ సాయిబాబు, కన్వీనర్‌ రత్నాకర్‌రావు తదితరులతో ట్రాన్స్‌కో-జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు, రెండు విద్యుత్తు పంపిణీ సంస్థల సీఎండీలు రఘుమారెడ్డి, ఎ.గోపాలరావు జరిపిన చర్చలు ఎట్టకేలకు ఫలించాయి.

Telangana: విద్యుత్ ఉద్యోగులకు శుభవార్త..7 శాతం ఫిట్‌మెంట్‌తో పాటు..
Electricity
Aravind B
|

Updated on: Apr 16, 2023 | 10:37 AM

Share

విద్యుత్తు ఉద్యోగులకు 7 శాతం ఫిట్‌మెంట్‌ పెంపుతో కొత్త వేతన సవరణ ఒప్పందం కుదిరింది. శనివారం సాయంత్రం విద్యుత్‌సౌధ సమావేశ మందిరంలో ఉద్యోగ సంఘాల ఐక్యకార్యాచరణ సమితి ఛైర్మన్‌ సాయిబాబు, కన్వీనర్‌ రత్నాకర్‌రావు తదితరులతో ట్రాన్స్‌కో-జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు, రెండు విద్యుత్తు పంపిణీ సంస్థల సీఎండీలు రఘుమారెడ్డి, ఎ.గోపాలరావు జరిపిన చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. అయితే తమకు జీతాలు పెంచకుంటే ఈ నెల 17 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని గత నెల 30న ఐకాస నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. చర్చలు ఫలించడంతో కొత్త వేతన సవరణ ఒప్పందంపై విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు, ఐకాస నేతలు సంతకాలు చేశారు. ఈ మేరకు సమ్మె నోటీసును ఉపసంహరించుకున్నట్లు ఐకాస తెలిపింది.

అయితే కొత్త పీఆర్‌సీ నిబంధనల ప్రకారం..ప్రతి ఉద్యోగికి 7 శాతం ఫిట్‌మెంట్‌తో 2022 ఏప్రిల్‌ 1 నుంచి వేతనం రానుంది. గత 12 నెలల కొత్త పీఆర్‌సీ పెంపు బకాయిలను వచ్చే 12 నెలల్లో సమాన వాయిదాల్లో చెల్లిస్తారు. అలాగే ఉద్యోగి సర్వీసు కాలం 5 ఏళ్లలోపు ఉంటే అదనంగా ఒక ఇంక్రిమెంట్‌, 5 నుంచి 15 ఏళ్లుంటే 2, అంతకుమించి సర్వీసు ఉంటే 3 ఇంక్రిమెంట్లు ఇస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న విధానంలోనే ఇంటి అద్దె భత్యం, పింఛను చెల్లిస్తారు. రిటైర్‌మెంట్ గ్రాట్యుటీని రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచుతారు. మరోవైపు వైద్యఖర్చులకు చెల్లించే మొత్తాన్ని రూ.5 లక్షల నుంచి సుమారు రూ.10 లక్షలకు పెంచడానికి సీఎండీలు అంగీకరించినట్లు ఐకాస పేర్కొంది. ఇంకో ఆఫర్ ఏంటంటే ఒకవేళ ఉద్యోగి తన వేతనం నుంచి నెలకు రూ.1000 చెల్లిస్తే వైద్య ఖర్చులకు ఇచ్చే సొమ్ము రూ.12 లక్షలు ఉంటుంది. 1999 నుంచి 2004 మధ్యకాలంలో ఉద్యోగాల్లో చేరినవారిని ఈపీఎఫ్‌ నుంచి జీపీఎఫ్‌లోకి మార్చాలనే ప్రతిపాదనను ట్రాన్స్‌కో పాలకమండలి సమావేశంలో ఆమోదించి ప్రభుత్వానికి పంపుతామని సీఎండీలు చెప్పినట్లు ఐకాస తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.