AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షం బీభత్సం… పిడుగుపడి ఆరుగురు దుర్మరణం.. భారీగా పంట నష్టం

Telangana State: తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులు, పిడుగులు, వడగండ్లతో కూడిన వర్షం పలు చోట్ల నష్టాన్ని మిగిల్చింది....

Telangana: తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షం బీభత్సం... పిడుగుపడి ఆరుగురు దుర్మరణం.. భారీగా పంట నష్టం
Thunderbolt
Subhash Goud
| Edited By: Shiva Prajapati|

Updated on: Apr 13, 2021 | 6:54 AM

Share

Telangana State: తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులు, పిడుగులు, వడగండ్లతో కూడిన వర్షం పలు చోట్ల నష్టాన్ని మిగిల్చింది. పిడుగు పాటుకు పలువురు మృత్యువాత పడ్డారు. మూగు జీవాలు సైతం ప్రాణాలు కోల్పోయాయి. ఇంకా ధాన్యం రాలిపోగా, యార్డుల్లో ఉంచిన ధాన్యం తడిసి ముద్దయింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పరిధిలోని లింగోజిగూడెం గ్రామానికి చెందిన రైతు దంపతులు సోమవారం పిడుగు పాటుకు దుర్మరణం చెందారు. బండారు కరుణాకర్‌రెడ్డి (65), ఆయన భార్య వేణమ్మ (55) సోమవారం సాయంత్రం వ్యవసాయ బావి వద్ద గేదెకు పాలు తీసేందుకు వెళ్లగా, వర్షం పడుతుండగా, చింతచెట్టు కిందకు వెళ్లారు. చెట్టుపై పిడుగు పడటంతో దంపతులిద్దరు అక్కడికక్కడే మరణించారు. పాడిగేదె సైతం మృతి చెందింది.

అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. బొమ్మలరామారం మండలం మర్యాల గ్రామానికి చెందిన మన్నె రాములు (70) మామిడి చెట్టు కింద నిలబడగా, పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక అకాల వర్షం కారణంగా మార్కెట్‌ యార్డుల్లో ఉంచిన ధాన్యం సైతం పూర్తిగా తడిసిపోయింది. ఆత్మకూరు (ఎం)లో పిడుగుపడటంతో ధనబోయిన యాదయ్యకు చెందిన ఓ గేదె, ఆరు గొర్రెలు మృతి చెందాయి.

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పిడుగు పాటుతో ముగ్గురు..

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పిడుగు పాటుకు ముగ్గురు వ్యక్తులు మరణించారు. పదుల సంఖ్యలో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం ఇందుప్రియాల్‌ గ్రామానికి చెందిన సంబాగ రామయ్య (60) పొలం వద్ద పనులు చేస్తుండగా, వర్షం రావడంతో చెట్టు కిందకు వెళ్లాడు. అదే సమయంలో పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. రాయపోలు మండలంలోని మంతూరులో పొలం పనులు చేస్తున్న పట్నం నర్సింహులు (32) పిడుగు పడి మరణించాడు. అలాగే మెదక్‌ జిల్లా చిన్న శంకరంపేటలో పిడుగు పాటుకు ఇటుక బట్టి కార్మికుడు దొగ్రి ఈశ్వర్‌ (40) మృతి చెందాడు. మరో కార్మికుడు సంజయ్‌ అపస్మారక స్థితికి చేరుకోగా, ఆస్పత్రికి తరలించారు. తోగుట మండలంలోని వెంకట్రావుపేటకు చెందిన మిద్దె లక్ష్మీ, భీమరి ఎల్లవ్వ, బెస్త వెంకటవ్వ, బెజ్జరమైన సుజాత వ్యవసాయ పనులకు వెళ్లారు. వర్షం రావడంతో సమీపంలోనిని ట్రాక్టర్‌ ట్రాలీ కిందకు వెళ్లాడు. అదే సమయంలో పిడుగు పడటంతో ట్రాలీకి విద్యుత్‌ సరఫరా అయి సొమ్మసిల్లిపడిపోయాడు. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక ముత్యంపేట, ముబరాస్‌పర్‌ గ్రామాల్లో పిడుగుపాటుతో 3 పశువులు మృతి చెందాయి. గొల్లపల్లిలో పిడుగు పాటుకు 15 మేకలు మృతి ఇక చేర్యాల మండలం గుర్జకుంటలో పిడిగుపడి 5 మేకలు మృత్యువాత పడ్డాయి. ఇలా అకాల వర్షం కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతినగా, పిడుగు పాటుకు పలువురు మృత్యువాత పడ్డారు.

Rain

Rain

ఇవీ చదవండి: వరంగల్‌లో మంత్రి కేటీఆర్‌ సుడిగాలి పర్యటన… రూ.2500 కోట్ల అభివృద్ధి, సంక్షేమ పనుల శ్రీకారం

Coronavirus Pandemic: కరోనా వైరస్ కల్లోలం … దేశీయ విమానాల్లో ఇక నుంచి ఆ సేవలు బంద్