Telangana: రోడ్డు పక్కన అదో మాదిరి చప్పుళ్లు.. బండి లైట్ వేసి చూడగా
అందరూ ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారు. ఇంతలో ఓ భారీ సైజ్ కొండచిలువ రోడ్డుపై కనబడింది. ఇది చూసిన జనం దెబ్బకు పరుగులు తీశారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండాల్సిన కొండచిలువ.. జనవాసంలోకి వచ్చింది. తర్వాత పక్కనే ఉన్న వాగులోకి పంపించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రెండవ బైపాస్ రోడ్‌లో కొండచిలువ కనబడింది. వేములవాడ పట్టణంలోని రెండవ బైపాస్ రోడ్డు ధోబి ఘాట్ ప్రక్కన కొండచిలువ ప్రత్యక్షమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మూలవాగు నుంచి కొండచిలువ రోడ్డు వైపు వస్తుండగా స్థానికులు గుర్తించారు. కొండచిలువ కనబడడంతో రోడ్డున వెళ్లే ప్రజలు, వాహనదారులు పెద్ద ఎత్తున గూమిగూడారు. భారీ సైజ్‌లో కొండ చిలువ ఉంది.
ఇది చదవండి: నీటి అడుగున తేలియాడుతున్న వింత జీవి.. వీడియో చూస్తే మైండ్ బ్లాంక్
6 ఫీట్ల కంటే ఎక్కువగానే పొడువు ఉంది. స్పీడ్‌గా నడవలేకపోయింది. ఈ కొండ చిలువను చాలామంది తమ ఫోన్లతో ఫొటోస్, విజువల్స్ తీసుకున్నారు. పెద్ద ఎత్తున జనం గుమికూడటంతో పోలీసులు అక్కడి నుంచి పంపించారు. అటవీ శాఖ అధికారులు అక్కడి నుంచి కొండచిలువను తరలించే ప్రయత్నం చేశారు. మెల్లగా మూల వాగుకి పంపించారు. అక్కడి నుంచి కొండ చిలువను పంపించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇది చదవండి: కొండ కింద నల్లటి ఆకారం.. కెమెరాకు పని చెప్పి జూమ్ చేయగా దిమ్మతిరిగింది








