AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో దేవుడా.. ఈ చిన్నారికి అప్పుడే నూరేళ్లు నిండాయా.. అంత్యక్రియలకు వచ్చి..

రాజన్న సిరిసిల్ల జిల్లా చిన్నలింగాపూర్‌ గ్రామంలో ఓ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కార్యక్రమాల కోసం గ్రామానికి వచ్చిన నాలుగేళ్ల చిన్నారి పాముకాటుకు గురై మృతి చెందింది. ఈ ఘటన తంగళ్లపల్లి మండలంలోని చిన్నలింగాపూర్ గ్రామాన్ని విషాదఛాయలతో ముంచెత్తింది. వివరాల ప్రకారం..

అయ్యో దేవుడా.. ఈ చిన్నారికి అప్పుడే నూరేళ్లు నిండాయా.. అంత్యక్రియలకు వచ్చి..
Girl Dies after Snake Bite
G Sampath Kumar
| Edited By: |

Updated on: May 20, 2025 | 1:08 PM

Share

రాజన్న సిరిసిల్ల జిల్లా చిన్నలింగాపూర్‌ గ్రామంలో ఓ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కార్యక్రమాల కోసం గ్రామానికి వచ్చిన నాలుగేళ్ల చిన్నారి పాముకాటుకు గురై మృతి చెందింది. ఈ ఘటన తంగళ్లపల్లి మండలంలోని చిన్నలింగాపూర్ గ్రామాన్ని విషాదఛాయలతో ముంచెత్తింది. వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా వాసులైన వలిదాసు కృష్ణయ్య, లలిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు.. స్నేహాన్షి (4), శ్రీజ (2) ఉన్నారు. కుటుంబ బంధువుల సంవత్సరీకం, మరొక బంధువు అంత్యక్రియలు జరగనున్న నేపథ్యంలో, లలిత ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిగారి ఇల్లు చిన్నలింగాపూర్‌కు వచ్చారు. గ్రామంలో ఏర్పాటైన రెండు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కుటుంబ సభ్యులు సంతాపంలో నిమగ్నమై ఉన్న తరుణంలో ఈ విషాదకర ఘటన జరిగింది. ఆడుకుంటూ వెళ్లిన చిన్నారిని విషసర్పం కాటు వేసింది.

ఇంటి ఎదురుగా ఆడుకుంటున్న చిన్నారి స్నేహాన్షిని పాము కరిచింది. దీంతో బాలిక హఠాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.. ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే మార్గ మధ్యంలోనే పాప మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

కూతురును పోగొట్టుకున్న తల్లిదండ్రులు తట్టుకోలేని దుఃఖంతో బోరున విలపించారు. అప్పటివరకు ముద్దు ముద్దు మాటలతో.. సందడితో తిరిగిన చిన్నారి మృతదేహాన్ని చూస్తూ.. బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

గ్రామీణ ప్రాంతాల్లో ఈ మధ్య తరచుగా పాము కాట్లు కేసులు నమోదవుతున్నాయి.. వర్షాలు పడుతుండటంతో పాములు సంచరించే అవకాశం ఉందని.. ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, చిన్నపిల్లలను ఒంటరిగా బయటికి వెళ్లనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!