AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నెల రోజుల్లో 10 మంది మరణం.. ఊరికి కీడంటూ ప్రచారం.. ఆ గ్రామస్థులు ఏం చేశారంటే..?

ఆ ఊళ్లో నెల రోజుల్లోనే పది మంది వరకు చనిపోయారు. దీంతో ఆ ఊరికి కీడుచేస్తుందని గ్రామస్థులంతా ఊరు విడిచి పొలిమేర దాటి వనభోజనాలకు వెళ్లారు. ఇలా చేస్తే మంచి జరుగుతుందని పురోహితుడు చెప్పాడట...

Telangana: నెల రోజుల్లో 10 మంది మరణం.. ఊరికి కీడంటూ ప్రచారం.. ఆ గ్రామస్థులు ఏం చేశారంటే..?
Ram Naramaneni
|

Updated on: Feb 23, 2021 | 8:25 PM

Share

ఆ ఊళ్లో నెల రోజుల్లోనే పది మంది వరకు చనిపోయారు. దీంతో ఆ ఊరికి కీడుచేస్తుందని గ్రామస్థులంతా ఊరు విడిచి పొలిమేర దాటి వనభోజనాలకు వెళ్లారు. ఇలా చేస్తే మంచి జరుగుతుందని పురోహితుడు చెప్పాడట. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొమిరె గ్రామంలో గత నెల రోజుల క్రితం వివిధ కారణాలతో పదిమంది వరకు చనిపోయారట. అందుకే ఆ గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు ఏం చేయాలో అర్థంకాక తలలు పట్టుకున్నారు. స్థానిక సర్పంచ్, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు కలిసి పురోహితుడిని ఆశ్రయించారు.

ఊరికి కీడు చేసిందని, ఆ గ్రామానికి అరిష్టం అని.. అందుకే వివిధ కారణాలతో చనిపోయారని ఆ పురోహితుడు చెప్పడంతో గ్రామ ప్రజాప్రతినిధులు ఊరిలో దండోరా వేయించారు.. ఊరి జనమంతా ఉదయం తొమ్మిది గంటలకు ఊరు విడిచి వెళ్లాలని, చీకటి పడేవరకు ఊర్లో ఎవరూ ఉండొద్దని ఊరంతా చాటింపు చెప్పారు. గ్రామ దేవతలకు కొబ్బరికాయలు కొట్టి, ప్రత్యేక పూజలు చేసి ఇళ్లకు తాళాలు వేసి పిల్లాజెల్లా అందరూ ఊరి పొలిమేర దాటి వెళ్లి వన భోజనాలు జరుపుకున్నారు. దీంతో ఆ గ్రామస్థులు ఇప్పుడు సంతోషంగా ఉన్నామని కీడు పోయిందని, ఆనందం వ్యక్తం చేస్తున్నారు

ఏది ఏమైనా ఈ ఆధునిక యుగంలో కూడా ఇంకా మూఢ నమ్మకాల ఊబిలో ప్రజలు ఉన్నారు. మూఢ నమ్మకాలు ప్రోత్సహించకుండా పోలీసులు స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు.

Also Read:

నల్లగా ఉన్నావ్.. వదిలేసి.. మరొకర్ని పెళ్లి చేసుకుంటానన్న భర్త.. భార్య ఊహించని పని చేసింది

ఓటీటీ ఎపిసోడ్ల మాదిరిగా పోర్న్ కంటెంట్.. వారానికో ఎపిసోడ్ రిలీజ్.. విచారణలో దిమ్మతిరిగే విషయాలు

Horoscope Today: వారికి ఆరోగ్యానికి, ఆదాయానికి ఇబ్బంది ఉండదు..
Horoscope Today: వారికి ఆరోగ్యానికి, ఆదాయానికి ఇబ్బంది ఉండదు..
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!