‘జూమ్’ యాప్.. ఈ మూడు మెయిల్స్ ఓపెన్ చేశారో.. అంతే సంగతులు..!
లాక్‌డౌన్ నేపథ్యంలో ఇండియాలో జూమ్ యాప్ వినియోగం ఒక్కసారిగా పెరిగింది. వీడియో కాన్ఫరెన్స్‌లు, ఆన్‌లైన్ క్లాసెస్, ప్రెస్ మీట్స్ ఇలా అన్నీ ఈ యాప్‌లోనే జరుగుతున్నాయి.

లాక్‌డౌన్ నేపథ్యంలో ఇండియాలో జూమ్ యాప్ వినియోగం ఒక్కసారిగా పెరిగింది. వీడియో కాన్ఫరెన్స్‌లు, ఆన్‌లైన్ క్లాసెస్, ప్రెస్ మీట్స్ ఇలా అన్నీ ఈ యాప్‌లోనే జరుగుతున్నాయి. అయితే ఈ యాప్ వాడటం అంత సేఫ్ కాదని కేంద్ర హోం శాఖ హెచ్చరించింది. లాగిన్ తరువాత వ్యక్తిగత డేటా హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతున్నాయని సైబర్ భద్రతా సంస్థలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ అలర్ట్ చేయడంతో.. చాలా మంది యాప్‌ను అన్ ఇన్‌స్టాల్ చేశారు. ఈ యాప్‌కు ప్రత్యామ్నాయంగా మరో యాప్‌లను వాడుతున్నారు.
కాగా ఈ యాప్ నుంచి వచ్చే కొన్ని మెయిల్స్‌ను ఓపెన్ చేస్తే మన డేటా మొత్తం హ్యాక్ అయినట్లేనని ఓ సంస్థ తెలిపింది. జూమ్ అకౌంట్(Zoom Account), మిస్‌డ్ జూమ్ మీటింగ్(Missed Zoom Meeting), (కంపెనీ) మీటింగ్ క్యాన్సిల్డ్-కుడ్ వియ్ డు ఎ జూమ్ కాల్?([Company]Meeting Cancelled- Could We Do a Zoom Call?) అని వచ్చే మూడు మెయిల్స్‌ను ఓపెన్ చేయకండని వారు హెచ్చరిస్తున్నారు.
కాగా జూమ్ యాప్ వాడే వారికి కేంద్రం కొన్ని సూచనలు పాటించాలని కోరుతున్నారు.
1.ప్రతి మీటింగ్‌కు కొత్త యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాలి. 2.జూమ్ సెట్టింగ్స్‌లో వెయిటింగ్ రూమ్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేయాలి. స్క్రీన్ షేరింగ్‌ను కేవలం హోస్ట్/ అడ్మిన్ చేసేలా మార్పులు చేయాలి.ఒకసారి కాన్ఫరెన్స్ నుంచి తొలగించిన వ్యక్తి మళ్లీ జాయిన్ అవ్వకుండా ఆ ఆప్షన్‌ను యాప్ సెట్టింగ్స్‌లో డిజేబుల్ చేసుకోవాలి. 3.ఫైల్ ట్రాన్స్‌పర్ ఆప్షన్ ఎప్పుడూ ఆన్‌లో ఉంచుకోకూడదు. 4.మీటింగ్/ కాన్ఫరెన్స్‌లో అందరూ జాయిన్ అయ్యాక మీటింగ్‌ను లాక్ చేయాలి. 5.మొత్తం కాన్ఫరెన్స్ రికార్డు చేసుకునే ఆప్షన్‌ను డిజేబుల్ చేయండి. 6. మీటింగ్ అయిపోయాక.. యాప్ క్లోజ్ చేయకుండా ఎండ్ మీటింగ్ బటన్‌ను క్లిక్ చేసి కన్మర్ఫ్ చేసుకొని అప్పుడు క్లోజ్ చేయాలి.



