AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ChatGPT: ఏఐతో షాపింగ్.. అద్భుతాన్ని ఆవిష్కరించిన చాట్ జీపీటీ..!

టెక్నాలజీ పరుగులు పెడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) రాకతో ఇంటర్ నెట్ ముఖ చిత్రమే మారిపోయింది. అందులో కీలకభూమిక ఓపెన్ ఏఐ ఆధ్వర్యంలోని చాట్ జీపీటీ. ఇది గ్లోబల్ వైడ్ గా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. దీని ద్వారా పనులు ఎంత వేగంగా, సులభంగా జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే.

ChatGPT: ఏఐతో షాపింగ్.. అద్భుతాన్ని ఆవిష్కరించిన చాట్ జీపీటీ..!
Chat Gpt
Nikhil
|

Updated on: Apr 30, 2025 | 5:15 PM

Share

ఈమెయిల్స్ డ్రాఫ్టింగ్ దగ్గర నుంచి ఇటీవల వచ్చిన గిబ్లీ స్టైల్ ఇమేజ్ వరకూ  చాట్ జీపీటీ ఎన్నో అద్భుతాలు ఆవిష్కరిస్తోంది. ఇప్పుడు మరో ఒక ఆసక్తికర అప్ గ్రేడ్ ను ఓపెన్ ఏఐ తీసుకొచచింది. అదే ఈ-కామర్స్. అవునండి చాట్ జీపీటీ ద్వారా ఇకపై షాపింగ్ చేయొచ్చు. అమెజాన్ ఫ్లిప్ కార్ట్ ప్లాట్ ఫాం లలో ఎలా సెర్చ్ చేసి షాపింగ్ చేస్తామో.. అదే పంథాలో ఇకపై మనకు అవసరమైన వస్తువులను, మన అభిరుచికి అనుగుణంగా చాట్ జీపీటీ ద్వారా కొనుగోలు చేయొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

సరికొత్త డిఫాల్ట్ జీపీటీ-4ఓ మోడల్..

ఇప్పటి వరకూ ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలంటే.. లేదా ఎవరికైనా గిఫ్ట్ కొనుగోలు చేయాలంటే ఎలాంటి గిఫ్ట్ కావాలని అని చాట్ జీపీటీ అడిగితే అది సజెషన్స్ ఇస్తుంది. ఇకపై మీరు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి వాటిల్లో మాదిరిగా కస్టమర్ రివ్యూలు ఉంటాయి, పర్సనలైజ్డ్ రికమండేషన్ల ద్వారా మంచి వస్తువులను కొనుగోలు చేసుకునే వెసులుబాటు కలుగనుంది. అందుకోసం షాపింగ్ కేంద్రీకృత అప్ గ్రేడ్ ను ఓపెన్ ఏఐ తీసుకొచ్చింది. ఏఐ చాట్ బాట్ ద్వారా ఇప్పుడు మీరు ప్రోడక్ట్ ల చిత్రాలు, ధరలు, సమీక్షలు, కొనుగోలు లింక్ లను కూడా పొందుతారు. డిఫాల్ట్ జీపీటీ-4ఓ మోడల్ ద్వారా ఈ సామర్థ్యం చాట్ జీపీటీకి వచ్చింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ప్రో, ప్లస్, ఫ్రీ, సైన్ ఇన్ చేయకుండా ప్లాట్ ఫారం యాక్సెస్ చేసే వినియోగదారులతో సహా ఇది అందుబాటులో ఉంటుంది.

కంపెనీ పోస్ట్ ఇలా..

ఓపెన్ ఏఐ ఈ కొత్త మోడల్ ను తీసుకొచ్చిన సందర్భంగా తన అధికారిక ఎక్స్ అకౌంట్లో కీలక ప్రకటన చేసింది. చాట్ జీపీటీ సెర్చింగ్ కు అనేక అప్ డేట్ లను ప్రారంభించామని చెప్పడానికి తాము సంతోషిస్తున్నామని పేర్కొంది. వినియోగదారులకు మెరుగైన షాపింగ్ అనుభవాన్ని అందించడానికి ఈ కొత్త అప్ డేట్ ను పరిచయం చేశామని చెప్పారు. చాట్ జీపీటీలో ఉత్పత్తులను కనుగొనడం, పోల్చడం, కొనుగోలు చేయడం కోసం వంటి వాటిని సులభతరం చేయడం, వేగవంతం చేయడంపై ప్రయోగాత్మకంగా దీనిని ఆవిష్కరించినట్లు చెప్పారు. మెరుగైన ఉత్పత్తి ఫలితాలు, దృశ్య ఉత్పత్తి వివరాలు, ధర, సమీక్షలు, కొనుగోలు చేయడానికి ప్రత్యక్ష లింక్‌లు వంటివి చాట్ బాట్ ద్వారా అందుతాయని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఎలా పని చేస్తుందంటే..?

వినియోగదారుల ప్రశ్నలకు అనుగుణంగా వ్యక్తీగతీకరించిన రిజల్ట్స్ ను చాట్ జీపీటీ అందిస్తుందని ఓపెన్ ఏఐ పేర్కొంది. థర్డ్ పార్టీ సోర్సుల నుంచి అందుబాటులో ఉన్న ధరలు, వివరణలు, సమీక్షలను విశ్లేషించి, నిర్మాణాత్మక డేటాను చాట్ బాట్ అందిస్తుందని వివరించింది. అయితే ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా చేసే కొనుగోళ్ల నుంచి కంపెనీ ఏ విధమైన రిఫెరల్ కమీషన్‌లను పొందదని కూడా ఓపెన్ ఏఐ స్పష్టం చేసింది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు జాగ్రత్త.. స్ట్రోక్ వచ్చే ప్రమాదం..
ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు జాగ్రత్త.. స్ట్రోక్ వచ్చే ప్రమాదం..
ఈ చిత్రంలో రెండు అంకెలు ఉన్నాయ్.. 5 సెకన్లలో కనుగొన్నారో జీనియసే
ఈ చిత్రంలో రెండు అంకెలు ఉన్నాయ్.. 5 సెకన్లలో కనుగొన్నారో జీనియసే
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న దేఖ్ లేంగే సాలా సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న దేఖ్ లేంగే సాలా సాంగ్..
ఈ కష్టం ఏ తండ్రికీ రాకూడదు.. టెట్ పరీక్షకు తీసుకెళ్తుండగా..
ఈ కష్టం ఏ తండ్రికీ రాకూడదు.. టెట్ పరీక్షకు తీసుకెళ్తుండగా..
భారీ డీల్.. తెలంగాణలో అమెజాన్‌ డేటా సెంటర్‌.. ఎక్కడో తెలుసా?
భారీ డీల్.. తెలంగాణలో అమెజాన్‌ డేటా సెంటర్‌.. ఎక్కడో తెలుసా?
ప్రతి నెలా రూ.10 వేలు SIPలో పెడితే.. చేతికి ఎంతొస్తుంది?
ప్రతి నెలా రూ.10 వేలు SIPలో పెడితే.. చేతికి ఎంతొస్తుంది?
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల 2026 మార్కుల కేటాయింపులో కీలక మార్పులు
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల 2026 మార్కుల కేటాయింపులో కీలక మార్పులు
11 సినిమాలు చేస్తే 10 బ్లాక్ బస్టర్ హిట్లే.. తోపు హీరోయిన్..
11 సినిమాలు చేస్తే 10 బ్లాక్ బస్టర్ హిట్లే.. తోపు హీరోయిన్..
బంగారం, వెండి కొనాలనుకుంటే ఇదే రైట్‌ టైమ్‌!
బంగారం, వెండి కొనాలనుకుంటే ఇదే రైట్‌ టైమ్‌!
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..