కారు సైడ్ మిర్రర్‌పై రెడ్ లైట్.. మీ ప్రాణాలు కాపాడే సూపర్ టెక్నాలజీ ఇదే..
మీ కారు సైడ్ మిర్రర్‌పై ఉన్న రెడ్ లైట్ మామూలుది కాదు.. ఇది ఒక ప్రత్యేక భద్రతా ఫీచర్. ఇది బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్‌లో భాగం. ఈ లైట్ సమీపంలోని వాహనాల గుర్తించి మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ దీనిని లైట్ తీసుకోవద్దు..

ఈ రోజుల్లో హై-ఎండ్ కార్లు, కొత్త మోడళ్ల సైడ్ మిర్రర్‌లపై తరచుగా రెడ్ లైట్ మెరుస్తున్నట్లు మీరు గమనించి ఉండవచ్చు. ఇది కేవలండిజైన్ కోసమే అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది మీ భద్రతకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన, తెలివైన సాంకేతికతలో భాగమని నిపుణులు చెబుతున్నారు. కారు సైడ్ మిర్రర్‌పై మెరుస్తున్న ఈ రెడ్ లైట్ సాధారణంగా బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్‌లో భాగం. డ్రైవర్లు సురక్షితంగా లేన్‌లు మారడానికి, ప్రమాదాలు జరగకుండా ఉండటానికి ఈ టెక్నాలజీ సహాయపడుతుంది.
బ్లైండ్ స్పాట్ అంటే ఏమిటి?
బ్లైండ్ స్పాట్ అనేది డ్రైవర్ తన రియర్‌వ్యూ మిర్రర్ లేదా సైడ్ మిర్రర్‌లలో కూడా సులభంగా చూడలేని ప్రాంతం. ఈ ప్రాంతంలో మరొక వాహనం ఉన్నప్పుడు, డ్రైవర్ దాన్ని గమనించకుండా లేన్ మారడానికి ప్రయత్నిస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఈ బ్లైండ్ స్పాట్‌లోని వాహనాన్ని గుర్తించి డ్రైవర్‌ను అప్రమత్తం చేయడమే ఈ రెడ్ లైట్ పని.
ఈ తెలివైన వ్యవస్థ ఎలా పనిచేస్తుంది..?
సెన్సార్ల ఏర్పాటు: కారు బంపర్ వంటి వెనుక భాగంలో చిన్న రాడార్ సెన్సార్లు ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఇవి వాహనం యొక్క రెండు వైపులా రోడ్డును నిరంతరం స్కాన్ చేస్తూ ఉంటాయి.
రెడ్ లైట్ అలర్ట్: మరొక వాహనం మీ కారు బ్లైండ్ స్పాట్‌లోకి ప్రవేశిస్తే.. సెన్సార్‌లు వెంటనే దాన్ని గుర్తిస్తాయి. ఆ దిశలో ఉన్న సైడ్ మిర్రర్‌పై వెంటనే రెడ్ లేదా ఆరెంజ్ లైట్ వెలగడం ద్వారా డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తాయి.
సౌండ్ సిగ్నల్: డ్రైవర్ ఈ లైట్‌ను గమనించకుండా ఆ వైపుకు టర్న్ సిగ్నల్ వేస్తే, సిస్టమ్ మరింత అప్రమత్తమవుతుంది. లైట్ వేగంగా మెరుస్తూ లేదా బీప్ సౌండ్ విడుదల చేస్తూ డ్రైవర్‌ను గమనించమని గట్టిగా హెచ్చరిస్తుంది.
ఆటోమేటిక్ సహాయం: కొన్ని అత్యంత ఆధునిక కార్లలో, డ్రైవర్ హెచ్చరికను పట్టించుకోకుండా లేన్ మార్చడానికి ప్రయత్నిస్తే, సిస్టమ్ స్వయంచాలకంగా స్టీరింగ్‌ను కొద్దిగా సర్దుబాటు చేసి లేదా బ్రేక్‌లను వర్తింపజేసి ప్రమాదాన్ని నివారిస్తుంది.
రెండ్ లైట్‌కు మరో అర్థం కూడా:
కొన్ని సందర్భాలలో ఈ రెడ్ లైట్ బ్లైండ్ స్పాట్ వ్యవస్థ కాకుండా వేరే ప్రయోజనం కోసం కూడా ఉపయోగించవచ్చు యాంటీ-థెఫ్ట్ సిస్టమ్: కారును లాక్ చేసినప్పుడు సైడ్ మిర్రర్‌పై ఎరుపు లైట్ మెరుస్తున్నట్లయితే.. అది వాహనం యొక్క యాంటీ-థెఫ్ట్ వ్యవస్థ యాక్టివేట్ అయిందని సూచిస్తుంది.
డిజైన్ లైట్లు: కొన్ని కార్లలో అదనంగా అలంకరణ కోసం లేదా సిగ్నలింగ్ కోసం ఈ లైట్లను ఏర్పాటు చేసుకోవచ్చు.
ఈ వ్యవస్థ ఎందుకు అవసరం..?
డ్రైవర్లు వెనుక లేదా పక్కన ఉన్న వాహనాన్ని చూడలేకపోవడం వల్ల తరచుగా హైవేలపై ప్రమాదాలు జరుగుతాయి. ఈ బ్లైండ్ స్పాట్ వ్యవస్థ డ్రైవర్లను ముందుగానే హెచ్చరించడం ద్వారా అలాంటి ఘోర ప్రమాదాలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అధిక వేగంతో లేదా రద్దీగా ఉండే రోడ్లపై ప్రయాణించేటప్పుడు ఇది డ్రైవర్‌కు గొప్ప భద్రతను అందిస్తుంది.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




