చంద్రుడిపై నిర్మాణాలు అసాధ్యమా ?? కీలక సమాచారం పంపిన చంద్రయాన్-2
చంద్రుడిపై ఎన్నటికైనా ఇళ్లు నిర్మించాలనేది మనిషి కల. ఆ కలను నెరవేర్చేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో జూలై 22, 2019న శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 ఓ కొత్త సమాచారాన్ని పంపింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగి చరిత్ర సృష్టించిన చంద్రయాన్-2.. తాజాగా చంద్రుడిపై సూర్యుడి ప్రభావాన్ని గురించింది.
ఈ విషయాన్ని ఇస్రో వెల్లడించింది. అక్కడ మానవ ఆవాసాలకు.. సూర్యుడి కరోనల్ మాస్ ఎజెక్షన్లు పెద్ద సవాల్‌గా నిలిచే అవకావం ఉందని.. వీటిని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాల్సి ఉంటుందని ఇస్రో పేర్కొంది. చంద్రుని ఎక్సోస్పియర్, వాతావరణం, ఉపరితలంపై అంతరిక్ష వాతావరణం ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు ఈ సమాచారం సహాయపడుతుందని ఇస్రో పేర్కొంది. చంద్రయాన్-2 లూనార్ ఆర్బిటర్ అంతరిక్ష శాస్త్ర రంగంలో తొలిసారిగా ఈ సమాచారాన్ని సేకరించినట్లుగా వెల్లడించింది. చంద్రయాన్-2 లోని సాంకేతిక పరికరం అయిన ఛేస్-2 సూర్యుడి నుంచి వెలువడే కరోనల్ మాస్ ఎజెక్షన్ చంద్రుడి ఎక్సోస్పియర్‌పై ప్రభావాన్ని పరిశీలించింది. ఈ భారీ సౌర తుఫాను చంద్రుడిని తాకిన సమయంలో చంద్రుని పగటిపూట ఎక్సోస్పియర్‌లో మొత్తం పీడనం అకస్మాత్తుగా పెరిగిందని చంద్రయాన్-2 డేటా తెలిపింది. వాతావరణంలోని అణువులు, వాటి సాంద్రత పది రెట్లు ఎక్కువ పెరిగినట్లుగా ఛేస్-2 నమోదు చేసిందని ఇస్రో చెప్పింది. చంద్రుడికి భూమిలా అయస్కాంత క్షేత్రం, దట్టమైన వాతావరణం లేనందున ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్‌ల నుంచి వెలువడిన కణాలు నేరుగా చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టినట్లుగా తెలిపింది. ఈ కణాల ప్రభావం వల్ల చంద్రుని ఉపరితలం నుంచి పెద్ద సంఖ్యలో అణువులు ఎక్సోస్పియర్‌లోకి వెళ్లాయని.. దాంతో అత్యంత సన్నని పొర ప్రతికూలంగా ప్రభావితమైందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. సూర్యుడి నుంచి వచ్చే శక్తి, కరోనల్ మాస్ ఎజెక్షన్‌లు చంద్రుడి వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చంద్రయాన్-2 మొదటిసారిగా శాస్త్రీయంగా పరిశీలించిందని చెప్పింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Diwali Sales 2025: దీపావళి సేల్స్ ఎన్ని లక్షల కోట్లు దాటాయంటే.. జనం ఎక్కువగా మోజు పడ్డవి ఇవే
పట్టాలపై కూర్చున్న పెద్దాయన.. దూసుకొచ్చిన రైలు.. ఏమైందంటే
China: గంటకు 453 కి.మీ హై స్పీడ్ రైలును ఆవిష్కరించిన చైనా
Golden Dress: మెరిసిపోతున్న గోల్డెన్ డ్రెస్ చూసారా
Srikakulam: ఎస్పీ చూస్తుండగానే.. MLA పైకి రివాల్వర్ ఎక్కుపెట్టిన మంత్రి
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

