భూమికి రెండో చంద్రుడు !! 2083 వరకు మనతోనే
భూమికి ఒక కొత్త స్నేహితుడు దొరికాడు. దీన్ని రెండో చంద్రుడిగా చెప్తున్నప్పటికీ ఇది నిజమైన చంద్రుడు కాదు. భూమిలాగే సూర్యుడి చుట్టూ దాదాపు ఒకే కక్ష్యలో పరిభ్రమిస్తున్న అరుదైన గ్రహశకలంగా నాసా గుర్తించింది. దీనికి ‘2025 PN 7’గా పేరు పెట్టింది. యూనివర్సిటీ ఆఫ్ హవాయి గుర్తించిన ఈ గ్రహశకలాన్ని నాసా అధికారికంగా ‘క్వాసీమూన్'లేదా పాక్షిక చంద్రుడిగా ధ్రువీకరించింది.
ఇది దాదాపు ఒక చిన్న భవనం అంత ఎత్తు ఉంది. అంతరిక్ష ప్రమాణాల ప్రకారం ఇది చిన్నదే అయినప్పటికీ భూమికి పొరుగునే ఉండటం విశేషం. ఇది మన చంద్రుడిలా భూమి గురుత్వాకర్షణ శక్తికి లోను కాలేదు. కాకపోతే ఒకే ట్రాక్‌పై మనతో పరుగు తీస్తున్న ‘స్నేహపూర్వక రన్నర్’లా ఉందని శాస్త్రవేత్తలు పోల్చారు. సూర్యుడి చుట్టూ తిరిగేటప్పుడు ఇది భూమిని అనుసరిస్తున్నట్టు కనిపిస్తుంది. ‘2025 PN7’ గత 60 సంవత్సరాలుగా భూమితో దాదాపు ఒకే వేగంతో, ఒకే కక్ష్యలో ప్రయాణిస్తున్నట్టు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత కక్ష్య స్థిరంగా ఉంటే 2083 వరకు ఇది మనతోనే ఉంటుంది. ఆ తర్వాత ఇది అంతరిక్షంలోకి వెళ్లిపోయే అవకాశం ఉంది. ఇది మన భూమికి అత్యంత దగ్గరగా వచ్చినప్పుడు 40 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది చంద్రుడి దూరం కంటే 10 రెట్లు ఎక్కువ. సూర్యుడు, ఇతర గ్రహాల గురుత్వాకర్షణ ప్రభావం వల్ల ఇది 1.7 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించగలదు. క్వాసీ మూన్స్ చాలా అరుదైనవి. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కేవలం ఎనిమిదింటిని మాత్రమే గుర్తించారు. ఈ గ్రహశకలాలు అంతరిక్షంలో భూమి గురుత్వాకర్షణ ప్రభావాన్ని తెలుసుకునేందుకు ఉపయోగపడతాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పొలం పనుల్లో కూలీలు బిజీ.. అంతలోనే చిరుత
తెలంగాణలో రాకాసి ఏనుగు శిలాజం.. బిర్లా సైన్స్ మ్యూజియంలో ప్రదర్శన
Cyclone Alert: తరుముకొస్తున్న తుఫాన్.. తీరం దాటేది అక్కడే
దహాడీ వేడుకల్లో.. వాతల వైద్యం ఒక్క చురుకుతో.. ఏ రోగమైనా పరార్
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..

