తెలంగాణలో రాకాసి ఏనుగు శిలాజం.. బిర్లా సైన్స్ మ్యూజియంలో ప్రదర్శన
6 వేల ఏళ్ల క్రితం భూమిపై సంచరించిన రాకాసి ఏనుగుల దంతాల శిలాజాలను తెలంగాణాలోని సింగరేణిలో గుర్తించారు. దంతాలు దొరికిన చోటే అన్వేషిస్తే ఏనుగు శిలాజం కూడా దొరకవచ్చు అనే ఆసక్తితో ప్రస్తుతం పురావస్తు శాఖ తవ్వకాలకు సిద్ధమవుతోంది. 11 మిలియన్ సంవత్సరాల నుంచి 6 వేల ఏళ్ల క్రితం వరకు భూమిపై స్టెగొడాన్ ఏనుగులు మనుగడ సాగించాయి.
స్టెగొడాన్ ఏనుగులు ఇప్పుడున్న ఏనుగులతో పోలిస్తే చాలా పెద్దగా ఉండేవి. దాదాపు 13 అడుగుల ఎత్తు, 13 టన్నులకు పైగా బరువు ఉండే భారీ జీవులవి. ఆసియా ఖండంలోని కొన్ని ప్రాంతాల్లో 6 వేల ఏళ్ల క్రితం జీవించి ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. వాతావరణ మార్పుల ప్రభావంతో క్రమంగా అవి అంతరించిపోయాయి. ప్రస్తుత రామగుండం పరిసర ప్రాంతాలు కూడా ఒకప్పుడు వాటి ఆవాసాలే. నాలుగేళ్ల క్రితం రామగుండం బొగ్గు గనుల్లో కొన్ని శిలాజాలను గుర్తించారు. ఈ జాతి ఏనుగుల దంతాలు 12 అడుగుల పొడవుంటాయి. సింగరేణిలో గుర్తించిన దంతాల పొడవు దాదాపు 8 అడుగులు ఉంది. ప్రస్తుతం రెండు దంతాలను హైదరాబాద్‌లోని బిర్లా సైన్స్ సెంటర్‌లో ప్రదర్శనకు ఉంచారు. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్‌లోని యామనపల్లి ప్రాంతంలో డైనోసార్ శిలాజాలు లభించాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Cyclone Alert: తరుముకొస్తున్న తుఫాన్.. తీరం దాటేది అక్కడే
దహాడీ వేడుకల్లో.. వాతల వైద్యం ఒక్క చురుకుతో.. ఏ రోగమైనా పరార్
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

