పట్టాలపై కూర్చున్న పెద్దాయన.. దూసుకొచ్చిన రైలు.. ఏమైందంటే
వయసు పై బడిన వారు కొన్నిసార్లు చిన్న పిల్లల తరహాలో ప్రవర్తిస్తుంటారు. ఇంకొందరు వృద్ధులు లేటు వయసులో యువకుల తరహాలో స్టంట్స్ చేస్తూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. మరికొందరు ప్రాణం అంచుల దాకా వెళ్లి.. అదృష్టవశాత్తు బయటపడుతుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి.
తాజాగా, అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ పెద్దాయన రైలు పట్టాలపై కూర్చున్నాడు. అదే సమయంలో ఓ రైలు అటుగా దూసుకొచ్చింది. చివరకు ఏం జరిగిందంటే.. రైలు పట్టాలు దాటే క్రమంలో అలా చేశాడో ఏమో కానీ.. ఓ పెద్దాయన విచిత్రంగా పట్టాలపై కూర్చున్నాడు. దూరంగా రైలు అటుగా దూసుకొస్తోంది. అయినా ఆ పెద్దాయన పైకి లేవకుండా అలాగే ఉన్నాడు. ఆ రైలు తీరా సమీపానికి రాగానే ఒక్కసారిగా పైకి లేచాడు. తీరా ఢీకొంటుందనగా.. ఆ పెద్దాయన ఒక్క ఉదుటున పైకి లేచి, ప్లాట్‌ఫామ్ మీదకు ఎక్కేశాడు. ఒక్క క్షణం ఆలస్యమైనా ఆయన ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. కావాలని చేశాడో.. లేక అనుకోకుండా అలా జరిగిందో కానీ.. ఆ పెద్దాయన చేసిన పని మాత్రం అక్కడున్న వారందరినీ షాకయ్యేలా చేసింది. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న వారంతా ఆ సీన్ చూసి ఖంగుతిన్నారు. వారిలో కొందరు ఈ ఘటనను తమ ఫోన్లలో రికార్డ్ చేశారు. వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘జీవితమంటే బోర్ కొట్టి అలా చేసుంటాడు. చివర్లో సత్యం గ్రహించి మనసు మార్చుకున్నాడు’.. అంటూ కొందరు, యమరాజును కలిసే ప్రోగ్రామ్‌ను జస్ట్ మిస్ చేసుకున్నాడు అంటూ ఇంకొందరు వివిధ రకాల ఎమోజీలతో మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
China: గంటకు 453 కి.మీ హై స్పీడ్ రైలును ఆవిష్కరించిన చైనా
Golden Dress: మెరిసిపోతున్న గోల్డెన్ డ్రెస్ చూసారా
Srikakulam: ఎస్పీ చూస్తుండగానే.. MLA పైకి రివాల్వర్ ఎక్కుపెట్టిన మంత్రి
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు
ప్రపంచంలోనే 'లాంగెస్ట్' ఫ్లైట్ చూసారా..
నెలకు రూ. 8 వేలు జీతం.. కానీ రూ.13 కోట్ల జీఎస్టీ నోటీసు అందుకుంది
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చారు.. కళ్లలో స్ప్రే కొట్టి..
యూట్యూబ్ చూసి ఆపరేషన్.. చివరికి..
మొదటిరాత్రి కోసం ఆశగా ఎదురుచూసిన వధువుకు ఊహించని షాక్..
హైదరాబాద్కు బీచ్ వచ్చేస్తోందోచ్

