Whatsapp: వాట్సాప్‌లో పొరపాటున కూడా ఈ 5 మెస్సేజులు పంపకండి.. లైట్ తీసుకుంటే జైలుకే..
వాట్సాప్ ప్రైవేట్ యాప్ అయినా మీరు పంపే ప్రతి మెసేజ్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. అభ్యంతరకరమైన మెసేజ్‌లు పంపితే ఐటీ చట్టం కింద జైలు శిక్ష, జరిమానా పడతాయి. ఇటువంటి విషయాల్లో గ్రూప్ అడ్మిన్‌లు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

దీపావళి పండుగ వేళ సోషల్ మీడియా అంతా శుభాకాంక్షలతో నిండిపోతోంది. వాట్సాప్ గ్రూపులలో స్నేహితులు, బంధువులకు మెసేజ్‌లు పంపుకోవడం సర్వసాధారణం. అయితే వాట్సాప్ ఒక ప్రైవేట్ చాటింగ్ యాప్ అయినప్పటికీ మీరు పంపే ప్రతి సందేశంపై భారతీయ చట్టం ప్రకారం చర్య తీసుకోవచ్చు. అనుచితమైన లేదా అభ్యంతరకరమైన కంటెంట్‌ను షేర్ చేస్తే ఐటీ చట్టంలోని కఠిన సెక్షన్ల కింద జైలు శిక్ష, భారీ జరిమానాలు పడే అవకాశం ఉంది.
ఈ కంటెంట్‌ను షేర్ చేయవద్దు
ఏదైనా మెసేజ్ పంపే ముందు మీరు బాధ్యతాయుతంగా ఉండాలి. ముఖ్యంగా ఈ రకమైన కంటెంట్‌ను షేర్ చేస్తే తీవ్రమైన సమస్యలు తప్పవు
అడల్ట్ కంటెంట్ :
సరదా కోసం గ్రూపులకు అడల్ట్ వీడియోలు, ఫోటోలు లేదా జోకులను పంపితే గ్రూప్ సభ్యులు లేదా అడ్మిన్ అభ్యంతరం చెబితే ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద జైలు శిక్ష, జరిమానా పడవచ్చు.
దేశ వ్యతిరేక లేదా రెచ్చగొట్టే పోస్టులు
ఏదైనా గ్రూప్‌లో దేశ వ్యతిరేక కంటెంట్ ఉన్న పోస్ట్‌లు లేదా ఏదైనా మతం, కులం, లేదా సంస్థకు వ్యతిరేకంగా ద్వేషాన్ని పెంచే భాషను ఉపయోగించినట్లయితే, పోలీసులు దానిని తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. దేశద్రోహం లేదా దేశ వ్యతిరేక కార్యకలాపాల కింద అభియోగాలు నమోదై అరెస్టుకు దారి తీయవచ్చు.
పిల్లలపై హింస లేదా అశ్లీల కంటెంట్
వాట్సాప్ గ్రూప్‌లో పిల్లలపై హింసను చిత్రీకరించే అభ్యంతరకరమైన ఫోటోలు లేదా వీడియోలు షేర్ చేయడం పోక్సో చట్టం కింద ప్రత్యక్ష నేరం. ఇది వినోదం కోసం పంపినా సరే చట్టం చాలా తీవ్రంగా పరిగణించి తక్షణ చర్య తీసుకుంటుంది.
వ్యక్తిగత గొడవలు లేదా MMS వీడియోలు
ఎవరికైనా సంబంధించిన గొడవలు , హింస లేదా MMS వీడియోలను షేర్ చేయడం ఐటీ చట్టంలోని సెక్షన్ 66A, 153A కింద నేరం. ఇలాంటి మెసేజ్‌లు సమాజంలో ద్వేషాన్ని వ్యాప్తి చేసేవిగా పరిగణిస్తారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు.
గ్రూప్ అడ్మిన్‌లకు ముఖ్య సూచన
వాట్సాప్ ఒక శక్తివంతమైన మాధ్యమం. దీనిని బాధ్యతాయుతంగా ఉపయోగించడం ముఖ్యం. మీరు ఒక గ్రూప్ నిర్వాహకులైతే, గ్రూప్‌లో అనుచితమైన సందేశం లేదా వీడియోను షేర్ అయితే మీరు కూడా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. చట్టపరమైన సమస్యలకు దారితీసే ఏ తప్పు చేయకండి. నేటి డిజిటల్ యుగంలో ఆలోచనాత్మకంగా సందేశాలను పంపడం నిజమైన జ్ఞానానికి సంకేతం.
మరిన్ని టెక్ వార్తాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




