ఈ 10 సమస్యలకు మీ ఫోనే కారణం.. పడుకునే ముందు అలా చేస్తే జరిగిదే ఇదే..
రాత్రి పడుకునే ముందు ఫోన్ వాడటం మీ ప్రశాంతతకు ప్రధాన శత్రువు. మొబైల్ స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్ర హార్మోన్లను దెబ్బతీసి, నిద్రను ఆలస్యం చేస్తుంది. ఈ అలవాటు వల్ల కళ్లు దెబ్బతినడం, ఒత్తిడి, బరువు పెరుగుదలతో పాటు దీర్ఘకాలంలో గుండె జబ్బులు, మధుమేహం వంటి 10 ప్రమాదాలు తప్పవు.

ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లు మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఉదయం లేచిన వెంటనే మొబైల్ స్క్రీన్ చూడటం, రాత్రి పడుకునే ముందు కూడా సోషల్ మీడియాలో స్క్రోలింగ్ చేయడం లేదా వీడియోలు చూడటం చాలా మందికి అలవాటుగా మారింది. అయితే ఈ అలవాటు మీ ప్రశాంతమైన నిద్రకు అతిపెద్ద శత్రువు. నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడం వల్ల నిద్ర నాణ్యత దెబ్బతినడమే కాకుండా శరీరం, మనస్సుపై అనేక ప్రతికూల ప్రభావాలు ఉంటాయని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.
పడుకునే ముందు మొబైల్ ఫోన్ వాడకం వల్ల కలిగే 10 హానికర ప్రభావాలు
నిద్ర నాణ్యత దెబ్బతింటుంది: ఫోన్ స్క్రీన్ల నుండి వచ్చే బ్లూ లైట్ మెదడులో నిద్రను ప్రేరేపించే హార్మోన్ అయిన మెలటోనిన్ స్థాయిలను తగ్గిస్తుంది. దీనివల్ల ప్రశాంతమైన నిద్ర కరువవుతుంది.
నిద్ర ఆలస్యం: ఫోన్ వాడినప్పుడు మెదడు ఉత్తేజితమై, నిద్ర పోవడం కష్టమవుతుంది.
కంటికి నష్టం: అధిక కాంతి వల్ల కళ్లు పొడిబారడం, దురద, తలనొప్పి వంటి సమస్యలు వచ్చి కంటి చికాకు పెరుగుతుంది.
ఒత్తిడి పెరుగుదల: నిరంతరంగా సోషల్ మీడియాలో బ్రౌజ్ చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి.
మెదడుకు విశ్రాంతి లేదు: నిద్రపోయే ముందు ఫోన్ వాడితే మెదడుకు సరైన ప్రశాంతత లభించదు. దీనివల్ల అలసట పేరుకుపోతుంది.
జ్ఞాపకశక్తి, శ్రద్ధ తగ్గుతుంది: సరైన నిద్ర లేకపోవడం వల్ల మరుసటి రోజు ఏ పనిపైనా దృష్టి పెట్టలేరు. జ్ఞాపకశక్తి తగ్గుతుంది.
దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం: నిరంతర నిద్రలేమి కారణంగా గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.
హార్మోన్ల అసమతుల్యత: తగినంత నిద్ర లేకపోతే, శరీరంలోని హార్మోన్లు సరిగా పనిచేయవు.
బరువు పెరగవచ్చు: నిద్ర లేకపోవడం వల్ల ఆకలిని నియంత్రించే హార్మోన్లు దెబ్బతింటాయి. దీనివల్ల ఆకలి పెరిగి బరువు పెరిగే అవకాశం ఉంది.
మానసిక ఆరోగ్యం క్షీణత: ఫోన్ వ్యసనం, నిద్రలేమి, ఆందోళన అన్నీ కలిసి నిరాశకు దారి తీయవచ్చు.
నిపుణుల చిట్కా
మంచి నిద్ర, ఆరోగ్యకరమైన జీవితం కోసం.. పడుకునే ముందు కనీసం 30 నుండి 60 నిమిషాల ముందు మొబైల్ ఫోన్‌లను తప్పనిసరిగా ఆఫ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




