AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsapp: మీ మొబైల్‌లో నంబర్‌ సేవ్‌ చేయకుండానే వాట్సాప్‌ మెసేజ్‌ చేయండిలా..!

Whatsapp: ప్రస్తుత రోజుల్లో వాట్సాప్‌ అనేది జీవితంలో ఒక భాగమైపోయింది. వాట్సాప్‌ లేని స్మార్ట్‌ ఫోన్‌ అంటూ ఉండదు. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే..

Whatsapp: మీ మొబైల్‌లో నంబర్‌ సేవ్‌ చేయకుండానే వాట్సాప్‌ మెసేజ్‌ చేయండిలా..!
Subhash Goud
|

Updated on: Sep 19, 2022 | 7:00 AM

Share

Whatsapp: ప్రస్తుత రోజుల్లో వాట్సాప్‌ అనేది జీవితంలో ఒక భాగమైపోయింది. వాట్సాప్‌ లేని స్మార్ట్‌ ఫోన్‌ అంటూ ఉండదు. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు వాట్సాప్‌లో మునిగిపోతుంటారు. వాట్సాప్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌లలో ఒకటి. వాట్సాప్‌ లేని స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయంటే చాలా అరుదు అనే చెప్పాలి. స్మార్ట్‌ఫోన్ల రాకతో సంప్రదాయక మొబైల్‌ మెసేజ్‌లకు స్వస్తి చెప్పి పలు యాప్స్‌ను ఉపయోగించి మెసేజ్‌లను చేస్తుంటాం. వాట్సాప్‌ మనందరి నిత్యజీవితాల్లో ఒక భాగమైంది

వాట్సాప్‌లో ఒకరికి మెసేజ్‌ చేయాలంటే కచ్చితంగా ఆ వ్యక్తి నంబర్‌ మొబైల్‌లో సేవ్‌ అయి ఉండాలి. అప్పుడు మెసేజ్‌ పంపేందుకు వీలవుతుంది. ఇక థర్డ్‌పార్టీ యాప్స్‌ ఉపయోగించి వ్యక్తి నంబర్‌ సేవ్‌ చేసుకోకుండానే వాట్సాప్‌లో మెసేజ్‌ చేయవచ్చు. థర్డ్‌పార్టీ యాప్స్‌ను ఉపయోగించి మెసేజ్‌ చేయడం మన భద్రతకే భంగం వాటిల్లుతుంది. అంతేకాకుండా మనల్ని ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాలను మనలో చాలా మంది ఎదుర్కొన్న వాళ్లమే. కొన్ని సార్లు మనకు చికాకు కూడా తెప్పిస్తోంది. వాట్సాప్‌లో నంబర్‌ లేకుండా మెసేజ్ ఎలా పంపాలి లేదా కాంటాక్ట్ యాడ్ చేయకుండా వాట్సాప్ మెసేజ్ ఎలా పంపాలో తెలుసుకుందాం.

మీ ఫోన్‌లోని బ్రౌజర్‌ని(క్రోమ్‌ లేదా ఫైర్‌ఫాక్స్‌) ఒపెన్‌ చేయండి. ఇప్పుడు మీరు  http://wa.me/xxxxxxxxxx ఈ లింక్‌ని కాపీ చేసి యూఆర్‌ఎల్‌ అడ్రస్‌ బార్‌లోపేస్ట్‌ చేయాలి. ఇక్కడ xxxxxxxxxx స్థానంలో మన దేశం కోడ్‌ 91తో పాటు మీరు మెసేజ్‌ పంపాలనుకున్న మొబైల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. ఉదాహరణ: మీ వాట్సాప్‌లో సేవ్‌ చేసుకోలేని ఓ వ్యక్తి నెంబర్‌కు http://wa.me/919911111111 ఎంటర్‌ చేయాలి. ఇక్కడ తొలి రెండు అంకెలు మన దేశ కోడ్‌. తరువాత మెసేజ్‌ పంపాలనుకున్న వ్యక్తి మొబైల్ నంబర్‌. తరువాత మీరు వ్యకత్ఇ ఫోన్‌ నంబర్‌తో గ్రీన్‌ కలర్‌తో మెసేజ్‌ బటన్‌తో ఒక వాట్సాప్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది. గ్రీన్‌ కలర్‌ మెసేజ్‌బటన్‌పై క్లిక్‌ చేస్తే మీరు వాట్సాప్‌కు మళ్లించబడతారు. అంతే మీరు వ్యక్తి నెంబర్‌ను సేవ్‌ చేసుకోకుండా ఈ విధంగా మెసేజ్‌ చేయవచ్చును.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చలికాలంలో మార్నింగ్ వాకింగ్ చేయడం అంత ప్రమాదమా..? అసలు విషయం..
చలికాలంలో మార్నింగ్ వాకింగ్ చేయడం అంత ప్రమాదమా..? అసలు విషయం..
సినిమాలే కాదు.. మరో విషయంలోనూ రికార్డు క్రియేట్ చేసిన రష్మిక
సినిమాలే కాదు.. మరో విషయంలోనూ రికార్డు క్రియేట్ చేసిన రష్మిక
మరీ ఇలా ఉన్నారేంట్రా? 'ది రాజసాబ్' థియేటర్‌లోకి మొసళ్లు.. వీడియో
మరీ ఇలా ఉన్నారేంట్రా? 'ది రాజసాబ్' థియేటర్‌లోకి మొసళ్లు.. వీడియో
'జోన్ జీరో' అంటే ఏమిటి? తక్కువ శ్రమతో ఎక్కువ ప్రయోజనం ఇలా!
'జోన్ జీరో' అంటే ఏమిటి? తక్కువ శ్రమతో ఎక్కువ ప్రయోజనం ఇలా!
Horoscope Today: ఆ రాశి వ్యాపారులకు లాభాలే లాభాలు..
Horoscope Today: ఆ రాశి వ్యాపారులకు లాభాలే లాభాలు..
అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?