Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google Quality Images: గూగుల్‌లో క్వాలిటీ ఇమేజెస్‌ కావాలా..? ఇలా చేయండి

Google Quality Images: ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. గూగుల్‌ కూడా ఎన్నో ఫీచర్స్‌ను తీసుకువస్తుంది. అయితే ఏవైనా ఫోటోలు కావాలంటే ప్రతి ఒక్కరు గూగుల్‌ తల్లినే..

Google Quality Images: గూగుల్‌లో క్వాలిటీ ఇమేజెస్‌ కావాలా..? ఇలా చేయండి
Google
Follow us
Subhash Goud

|

Updated on: Sep 19, 2022 | 7:36 AM

Google Quality Images: ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. గూగుల్‌ కూడా ఎన్నో ఫీచర్స్‌ను తీసుకువస్తుంది. అయితే ఏవైనా ఫోటోలు కావాలంటే ప్రతి ఒక్కరు గూగుల్‌ తల్లినే నమ్ముకుంటారు. అందులో కావాల్సిన ఫోటోలు లభిస్తాయి. ఏ సమాచారం కావాలన్నా గూగుల్‌లో సెర్చ్‌ చేసి క్షణాల్లోనే తెలుసుకోవచ్చు. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌లో చాలా మంది తమకు కావాల్సిన ఇమేజెస్ దొరకడం లేదని ఫీలవుతుంటారు. అటువంటి, వారి కోసం కొన్ని కొత్త పద్దతులను తీసుకవచ్చింది గూగుల్‌. దీని వల్ల కావాల్సిన హైక్వాలిటీ ఫోటోలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇందుకు మీరు చేయాల్సిందల్లా.. గూగుల్‌ సెర్చ్‌లో ఇమేజ్ వచ్చాక దానిపై రైట్ క్లిక్ చేసి సెర్చ్ గూగుల్ ఫర్ ఇమేజ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే మీకు బోలెడన్ని ఇమేజెస్ కనబడుతాయి. అందులో మీకు కావాల్సిన ఇమేజ్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా ఇమేజెస్ దొరకనప్పుడు గూగుల్ అందించే రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా మీరు క్వాలిటీ ఇమేజెస్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇందుకుగాను మీరు మీ డెస్క్ టాప్ లేదా ఫోన్ లేదా ఇతర ఏ డివైజెస్‌లోనైనా గూగుల్​ఇమేజ్ సులభంగా డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

1. బ్రౌజర్‌లో https://images.google.com/అని టైప్ చేయండి.

2.వెబ్ పేజ్‌లోని కెమెరా ఐకాన్‌కు ఎడమవైపునకు ఉన్న సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

3. ఇప్పుడు మీరు మీకు కావాల్సిన ఇమేజ్ యూఆర్ఎల్ పేస్ట్ చేసి లేదా అప్‌లోడ్ యాన్ ఇమేజ్ ట్యాబ్ ద్వారా ఇమేజ్‌నుఅప్‌లోడ్ చేయండి. తద్వారా మీకు కావాల్సిన ఇమేజ్‌ను గూగుల్ సెర్చ్ చేసి పెడుతుంది.

4. ఒకవేళ మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నట్లయితే మీరు సెర్చ్ చేయాలనుకున్న శాంపిల్ ఇమేజ్‌పై రైట్ క్లిక్ చేసి సెర్చ్ గూగుల్ ఫర్ ఇమేజ్ అనే ఆప్షన్​ను ఎంచుకోండి. మీకు కావాల్సిన ఫోటోలు కనిపిస్తాయి.

5. మీ వద్ద ఉన్న ఇమేజ్‌ను గూగుల్ ఇమేజెస్ సైట్‌లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి కూడా సిమిలార్ ఇమేజెస్ మీరు సెర్చ్ చేసుకోవచ్చు.

స్మార్ట్ ఫోన్‌లో సైతం రివర్స్ సెర్చ్ ద్వారా మీకు కావాల్సిన ఇమేజెస్‌ను ఇట్టే వెతుక్కోవచ్చు.. ఎలాగంటే.. 6. రివర్స్ సెర్చ్ ద్వారా ఇమేజెస్ సెర్చ్ చేయాలనుకుంటే మీ ఫోన్‌లో గూగుల్ యాప్ ఖచ్చితంగా ఉండాలి.

7. సెర్చ్ బార్‌లో కెమెరా ఐకాన్‌పైన క్లిక్ చేయాలి. అప్పుడు మీ కెమెరా ఆటోమేటిక్‌గా ఆన్ అయి పిక్చర్ తీసుకోవాలా? అని మిమ్మల్ని అడుగుతుంది.

8. కెమెరా నుంచి మీరు ఫొటో తీయొచ్చు లేదా మీ ఫోన్‌లోని ఇమేజ్‌ను బ్రౌజ్ చేసి అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకుగాను మీరు ఆ విండో కింది భాగంలో ఎడమ వైపున ఉండేసెలక్ట్ యాన్ ఇమేజ్ అనే ఆప్షన్ అనే బటన్‌ను క్లిక్ చేస్తే మీకు కావాల్సిన ఫోటోలు వస్తాయి. తర్వాత డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి