AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsapp Working: ఆ ఫోన్స్‌లో త్వరలో వాట్సాప్ సేవలు బంద్.. ఆ పని చేయకపోతే ఇక అంతే..!

భారతదేశంలో ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్ యూజర్ కచ్చితంగా ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్‌ను వాడుతున్నారు.  మెటా యాజమాన్యంలోని వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ వినియోగదారులను ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే పెరిగిన టెక్నాలజీ కారణంగా వాట్సాప్ అప్ డేట్ అవుతూ పాత ఆండ్రాయిడ్, ఐ ఫోన్స్‌లో వాట్సాప్ అప్‌డేట్స్‌ను నిలిపేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Whatsapp Working: ఆ ఫోన్స్‌లో త్వరలో వాట్సాప్ సేవలు బంద్.. ఆ పని చేయకపోతే ఇక అంతే..!
New Feature In Whatsapp
Nikhil
|

Updated on: Aug 05, 2024 | 8:15 PM

Share

భారతదేశంలో ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్ యూజర్ కచ్చితంగా ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్‌ను వాడుతున్నారు.  మెటా యాజమాన్యంలోని వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ వినియోగదారులను ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే పెరిగిన టెక్నాలజీ కారణంగా వాట్సాప్ అప్ డేట్ అవుతూ పాత ఆండ్రాయిడ్, ఐ ఫోన్స్‌లో వాట్సాప్ అప్‌డేట్స్‌ను నిలిపేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పాత ఫోన్స్ వినియోగిస్తున్న వారు ముఖ్యమైన సందేశాలను కోల్పోకుండా ఉండటానికి వారి చాట్‌లను వెంటనే బ్యాకప్ చేయాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాట్సాప్ 35 స్మార్ట్ ఫోన్స్‌కు మద్దతు నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఏయే ఫోన్స్‌లో వాట్సాప్ సేవలను నిలిపివేస్తుందో? ఓసారి తెలుసుకుందాం. 

వాట్సాప్ ఇకపై 4.0 కంటే ముందు ఆండ్రాయిడ్ వెర్షన్‌లు, 11 కంటే ముందు ఐఓఎస్ వెర్షన్‌లను పని చేయదని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం వాట్సాప్ ఆండ్రాయిడ్ 5.0 లేదా అంతకంటే ఎక్కువ, ఐఓఎస్ 11 లేదా తర్వాతి వెర్షన్‌లలో పనిచేసే పరికరాలకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. కాబట్టి పాత సిస్టమ్‌లలోని వినియోగదారులు అంతరాయం లేకుండా యాప్‌ని ఉపయోగించడం కొనసాగించడానికి వారి పరికరాలను అప్‌గ్రేడ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వాట్సాప్ అధికారికంగా ఈ మార్పు ద్వారా ప్రభావితమయ్యే స్మార్ట్‌ఫోన్‌లను జాబితా ఇవ్వనప్పటికీ లీక్ అయిన నివేదిక ప్రకారం దాదాపు 35 ఫోన్‌లు ఇకపై యాప్‌‌నకు మద్దతు ఇవ్వవని గుర్తించారు. ఇందులో సామ్‌సంగ్, యాపిల్, మోటోరోలా, సోనీ, ఎల్‌జీ, హువాయ్ వంటి ప్రధాన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ల పరికరాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏయే ఫోన్స్‌లో వాట్సాప్ సేవలను నిలిపివేస్తుందో? ఓ సారి తెలుసుకుందాం.

సామ్‌సంగ్ కంపెనీకు చెందిన గెలాక్సీ ఏస్ ప్లస్, గెలాక్సీ కోర్, గెలాక్సీ ఎక్స్‌ప్రెస్ 2, గెలాక్సీ గ్రాండ్, గెలాక్సీ నోట్ 3 ఎల్‌టీఈ, గెలాక్సీ నోట్ 3 నియో ఎల్‌టీఈ ప్లస్, గెలాక్సీ ఎస్-2, గెలాక్సీ ఎస్3 మినీ వీఈ, గెలాక్సీ  ఎస్ 4 యాక్టివ్, గెలాక్సీ  ఎస్ 4 మినీ ఐ9190, గెలాక్సీ ఎస్-4 మినీ ఐ9192 డ్యూయోస్, గెలాక్సీ ఎస్ 4 మినీ ఐ 9195 ఎల్‌టీఈ, గెలాక్సీ ఎస్ 4 జూమ్ ఫోన్స్‌లో వాట్సాప్ పని చేసే అవకాశం ఉండదని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే యాపిల్ ఐఫోన్-5, ఐఫోన్-6, ఐఫోన్-6 ఎస్, ఐఫోన్ ఎస్ఈ, లెనోవో ఏ858టీ, లెనోవో పీ 70, లెనోవో ఎస్ 890, మోటరోలా మోటో జీ, మోటో ఎక్స్, హ్యూవాయ్ ఏసెండ్ పీ6 ఎస్, ఏసెండ్ జీ525, హ్యూవాయ్ సీ 199, హ్యూవాయ్ జీఎక్స్ 1 ఎస్, హ్యూవాయ్ వై 625, సోనీ ఎక్స్‌పీరియా జెడ్ 1, ఎక్స్ పీరియా ఈ3, ఎల్‌జీ ఆప్టిమస్ 4 ఎక్స్, ఆప్టిమస్ జీ, ఆప్టిమస్ జీ ప్రో, ఆప్టిమస్ ఎల్ 7 ఫోన్స్ వాట్సాప్ పని చేయదు.  ఈ నేపథ్యంలో ఆయా ఫోన్స్ వాడుతున్న వినియోగదారులు కచ్చితంగా చాట్ బ్యాకప్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..