Whatsapp New Feature: వాట్సాప్ నుంచి అద్దిరిపోయే ఫీచర్.. స్టిక్కర్లను మీరే క్రియేట్ చేసుకోవచ్చు..!
ఏ ఏడాది వాట్సాప్‌లో అద్భుతమైన ఫీచర్స్ రాబోతున్నాయి. చాటింగ్‌లో కొత్త అనుభూతిని ఇచ్చే కొన్ని ఫీచర్లను తీసుకువస్తుంది వాట్సాప్. దీంతో ఇకపై ఎక్కువగా టైప్ చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. పైగా సరికొత్త రూపంలో చాట్ చేసే అవకాశం ఉంటుంది. వాట్సాప్ కొత్త ఫీచర్ ‘స్టిక్కర్ మేకర్ టూల్’ పై పని చేస్తోంది. ఈ ఫీచర్ iOSలోని అప్లికేషన్‌లో స్టిక్కర్‌లను క్రియేట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది.

కొత్త స్టిక్కర్లు వస్తున్నాయి..
Wabetainfo ప్రకారం.. , చాట్ షేర్ యాక్షన్ షీట్‌లో ‘కొత్త స్టిక్కర్’ ఆప్షన్‌ను తీసుకురావాలని కంపెనీ ఆలోచిస్తోంది. ఈ ఫీచర్ వినియోగదారులు తమ లైబ్రరీ నుంచి ఫోటోలను ఎంచుకోవడానికి, బ్యాక్‌గ్రౌండ్ తీసివేయడానికి అవకాశం కల్పిస్తుంది. పూర్తి ఎడిటింగ్ అవకాశాన్ని కల్పిస్తుంది.
స్టిక్కర్ల కోసం ఇకపై నో థర్డ్ పార్టీ యాప్..
ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే.. థర్డ్ పార్టీ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. వాట్సాప్ వెబ్, డెస్క్‌టాప్‌లో ఇప్పటికే ఈ సదుపాయం ఉందని, అయితే iOSలో డెవలప్ చేసిన టూల్ వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని వాట్సాప్ యాజమాన్యం పేర్కొంది. యాప్‌లో స్టిక్కర్ మేకర్ సాధనాన్ని ఉపయోగించి స్టిక్కర్లను సృష్టించగల ఫీచర్ ప్రస్తుతం పురోగతిలో ఉందని, త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని తెలిపింది.

కొత్త గ్రూప్ కాలింగ్ ఫీచర్..
కాగా, WhatsApp macOS టూల్స్‌లో కొత్త గ్రూప్ కాలింగ్ ఫీచర్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది వాట్సాప్. దీని ద్వారా వినియోగదారులు ఎంపిక చేసిన వ్యక్తులతో గ్రూప్ కాల్స్ చేయడానికి అనుమతిస్తుంది. ఇంతకు ముందు MacOSలో గ్రూప్ కాల్ బటన్ డిజేబుల్ చేయబడటం, పని చేయకపోవడం వల్ల గ్రూప్ కాల్ సాధ్యమయ్యేది కాదు. అయితే, WhatsApp బీటా తాజా అప్‌డేట్‌లో, కాల్ బటన్‌లు ‘ఆడియో, వీడియో’లో అందుబాటులో ఉన్నాయి. దీంతో వినియోగదారులు ఇప్పుడు గ్రూప్ కాల్‌ని ఎంజాయ్ చేయొచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..